twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ పిక్ : పులితో ఫోటోనే కష్టం..అలాంటిది ఒళ్లో పడుకోబెట్టుకుని పాలు పట్టిస్తోన్న మెగా కోడలు

    |

    మెగా కోడలు ఉపాసనకు ప్రకృతి, మూగ జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో భాగంగా ఉపాసన తన ఇంట్లో కొన్ని వందల రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే అన్నింటికంటే ఎక్కువగా తాజాగా షేర్ చేసిన ఫోటో మాత్రం అందర్నీ షాక్‌కు గురి చేసింది. యమదొంగ సినిమాలోని పులి డైలాగ్ అందరికీ గుర్తొచ్చేలా ఉపాసన ఆశ్యర్యపరిచింది. పులితో ఫోటో కాదు.. ఏకంగా పులికి పాలు పట్టిస్తోంది మెగా కోడలు. అసలు సంగతి ఏంటో ఓ సారి చూద్దాం.

    ఇంకోసారి ఇలా చేయను..

    ఇంకోసారి ఇలా చేయను..

    అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఉపాసన.. ‘పులి పిల్లకు పాలు పట్టడం ఏంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్లీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. ఈ భూతంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే వాటిని పెంచుకోవడం, జూలో పెట్టడం వల్ల వాటిని రక్షించవచ్చు అనేది నేను నమ్మను. కోవిడ్ కారణంగా ఎవ్వరూ జూకు వెళ్లడం లేదు. టిక్కెట్స్ కొనడం లేదు. వారికి రెవెన్యూ రావడం లేదు. వారు దాన్ని పోషించలేకపోతున్నారు. అందుకే జూలో ఉన్న ఏనుగును నేను దత్తత తీసుకున్నాను.

    ఏనుగును దత్తత..

    ఏనుగును దత్తత..

    ఇలాంటి ఏనుగులు మళ్లీ అభయారణ్యంలో జీవించలేవు. అందుకే దాన్ని దత్తత తీసుకున్నాను. మళ్లీ జూలు ఎప్పుడు ఓపెన్ అవుతాయో మనకు ఓ అంచనా లేదు. మన హైద్రాబాద్ జూ ఎంతో పరిశుభ్రంగా, చక్కగా ఉంటుంది. క్షితిజ, ఆమె టీమ్, నేను కలిసి ఎన్నో మంచి పనులు చేశాం. నేను మీకు దాని గురించి అప్ డేట్ ఇస్తుంటాను.

     పులుల సంచారం..

    పులుల సంచారం..

    నేటి అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరంతా హైద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. వాటికి రక్షణ అవసరం' అంటూ ఉపాసన పులికి పాలు తాగిస్తోన్న ఫోటోను షేర్ చేసింది.

    భిన్న కామెంట్లు..

    భిన్న కామెంట్లు..

    ఇక ఉపాసన చేసిన ఈ సాహసానికి భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పులి బిడ్డకు పులి పాలు పడుతోందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అలా మీ చేతిలో మెగా వారసుడు ఎప్పుడు ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పిచ్చి పనులు చేయకండి, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Upasana Konidela Feeding Tiger. Was so excited to feed a tiger cub. But would never do it again! Statistics show that there are more tigers in captivity than in the wild. I don’t believe in keeping healthy wild animals as pets or in zoo’s .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X