అవార్డు అందుకున్న మెగా కోడలు.. నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదంటూ ఎమోషనల్
మెగా కోడలు ఉపాసన.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్కు సంబంధించిన అప్ డేట్స్ పెడుతూ.. ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. అయితే సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో ఉపాసనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదేమోనని అనిపిస్తోంది.

ఆరోగ్య చిట్కాలతో..
ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో.. సహజ సిద్దమైన ఆరోగ్య చిట్కాలను, రుచికరమైన వంటల గురించి తన ఫాలోవర్స్ కు చెబుతూ ఉంటుంది. అవి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తూ ఉంటుంది. ఇలా తనకు చేతనైన సహాయాన్ని చేస్తూ.. సోషల్ మీడియాను మంచి పనుల కోసం వాడుతోంది.

రామ్ చరణ్ అప్డేట్స్..
రామ్ చరణ్ సినిమా అప్డేట్స్ ను కూడా ఇస్తూ ఉంటుంది. ఎక్కడి ఈవెంట్ కు వెళ్లిన ఆ సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఉపాసన ఫోజులిస్తూ ఉంటే.. చిరంజీవి ఫోటోలు తీస్తున్న పిక్స్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కార్పోరేట్ రంగంలో అవార్డు..
ఇలా ప్రతీ ఒక్క అప్ డేట్ ను ఇచ్చే.. ఉపాసన నిరంతరం బిజీగానే ఉంటుంది. అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటూ ఉంటుంది. అయితే కార్పోరేట్ రంగంలో తనకొక అవార్డు లభించింది. మహాత్ముడి 150 జయంతి సందర్భంగా.. ఈ అవార్డును ఉపాసన అందుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

మా ఫ్యామిలీపై ఆయన ప్రభావం
అవార్డును అందుకున్న సందర్భంగా మహాత్ముడు చెప్పిన మంచి మాటలను గుర్తుచేసుకుంది. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. వేరే వారి సేవలో నిన్ను నీవు అర్పించుకో అంటూ గాంధీజీ కొటేషన్ ను కోట్ చేసింది. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. గాంధీజీ 150వ జయంతి మా కుటుంబానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటూ సైరా నరసింహా రెడ్డిని ట్యాగ్ చేసింది.

నీవు లేకపోతే సాధ్యమయ్యేది కాదు..
తన సతీమణికి అవార్డు లభించడంతో.. రామ్ చరణ్ ఆనందంలో మునిగిపోయాడు. ఇంకా ఇలాంటెన్నో అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదంతా నీవల్లే సాధ్యమైంది.. నీ ప్రేమ, సపోర్ట్ లేకుంటే సాధ్యమయ్యేది కాదంటూ ఎమోషనల్ గా బదులిచ్చింది.
సైరా విజయంలో ఉపాసన..
సైరా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఉపాసన ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైరాపై, తన భర్త రామ్ చరణ్ పై ఎన్నో ఎమోషనల్ ట్వీట్స్ చేసింది. సైరా సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు తమన్నాకు ప్రత్యేక బహుమతిని కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











