మీ బిజినెస్ మీది.. పెట్టుబడి మాది.. యువతలకు మెగా కోడలు అదిరిపోయే ఆఫర్
Upasana:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ తరచూ గొప్ప మనసు చాటుకుంటుంది ఈ మెగా కోడలు. ప్రస్తుతం ఉపాసన ఓ వైపు ఇల్లాలుగా మెగా కుటుంబంలోని ప్రేమానురాగాలు దక్కించుకుంటూనే.. మరోవైపు అపోలో ఆసుపత్రికి సంబంధించిన కీలక బాధ్యతలు చేపడుతుంది. రామ్ చరణ్ - ఉపాసన కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. వీరికి దాదాపు 11 సంవత్సరాల అనంతరం పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ రాకతో అటు ఫ్యాన్స్, ఇటు ఫ్యామిలీ తెగ సంబరపడిపోయారు. కానీ, ఒకటి మాత్రం సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే.. ఇప్పటివరకు బుజ్జాయి, చరణ్ గారాల పట్టి క్లింకార ఫేస్ చూపించకపోవడం. ఎప్పుడెప్పుడు క్లింకార ఫేస్ రివీల్ చేస్తారా ? అంటూ మెగా అభిమానులు కొండంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మెగా ప్రిన్సెస్ ముఖం పూర్తిగా చూసే భాగ్యం కలుగుతుందో చూడాలి మరీ. ఇదిలా ఉండగా..

తాజాగా మెగా కోడలు ఉపాసన యువతులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సతీమణి హెల్త్ కేర్ పైన ఫోకస్ చేశారు. హెల్త్ కేర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనుచరులతో పంచుకుంటూనే ఉంటున్నారు. నేడు ఉపాసన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ మెగా కోడలు ఉపాసన మాట్లాడుతూ.. హెల్త్ కేర్ రంగంలో యువ మహిళలు బిజినెస్ చేయండని కోరారు.
ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి తాను సహాయం చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా పార్ట్నర్‌గా ఉంటానని అన్నారు. అలాగే వారికి కో ఫౌండర్ అవుతానని తెలిపారు. భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంను మార్చడానికి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాసన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఉపాసన కరోనా సమయంలో ఎంతో మందికి హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. పలు గ్రామాలకు వైద్య సేవలు అందించింది. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లోని వృద్ధాశ్రయాలకు కూడా సహాయం అందించింది. ఫుడ్, టాబ్లెట్స్, పలు సౌకర్యాలు కల్పించింది. ఇప్పటికి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటుంది. దీంతో ఉపాసన అటు మంచి మెగా కోడలిగా ఇటు హెల్పింగ్ నేచర్‌లో మంచి మనసు గల వ్యక్తిగా కొనియాడుతుంటారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











