twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారెవా ఉపాసన కొణిదెల.. 50 కోట్ల కుటుంబాల కోసం మెగా కోడలు భారీ ప్లాన్

    |

    అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన కొణిదెల మరో తన మానవత్వాన్ని చాటుకొన్నారు. పేదలు, ఆర్థికంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించిన ప్రతీసారి ఉపాసన తన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనావైరస్ పరిస్థితులు కుదిపేస్తున్న సమయంలో ఉపాసన తనదైన శైలిలో స్పందించారు. పేద ప్రజలకు ఆరోగ్య భీమా గురించి వెల్లడిస్తూ..

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
     పేదలకు అందుబాటులో ఆరోగ్య భీమా అంటూ

    పేదలకు అందుబాటులో ఆరోగ్య భీమా అంటూ

    మీకు ఆరోగ్య భీమా ఉందా? మీరు ఎప్పుడైనా కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ పాలసీ గురించి విన్నారా? అంటూ ఉపాసన కొణిదెల ట్విట్టర్‌లో స్పందించారు. 50 కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్యానికి చక్కటి పరిష్కారం ఇది. ఆరోగ్య పరమైన ఎలాంటి ప్రభుత్వ స్కీములు లేదని వారికి అండగా ఉండటానికి రూపొందించిన భీమా పాలసీలు ఇవి. చాలా తక్కువ రుణంతోనే ఇలాంటి పాలసీలు చేయించుకోవచ్చు అని ఉపాసన చెప్పారు.

     మధ్య తరగతి భారతీయ కుటుంబాలకు

    మధ్య తరగతి భారతీయ కుటుంబాలకు

    ఆరోగ్య భీమా లేని మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలువడానికి మేము రెడీగా ఉన్నాం. అనారోగ్య పరిస్థితులు ఎంతో మందిని పేదరికంలోకి నెడుతున్నాయి. పేదలు కూడా భరించే తక్కువ మొత్తానికే మేము ఆరోగ్యసంరక్షణకు కట్టుబడి ఉన్నాం అంటూ ఉపాసన కొణిదెల తన ట్వీట్‌లో సమాచారం అందించారు.

     50 కోట్ల మంది భారతీయ కుటుంబాలకు

    50 కోట్ల మంది భారతీయ కుటుంబాలకు

    మధ్య తరగతికి చెందిన 50 కోట్ల భారతీయ కుటుంబాలకు అండగా నిలువడానికి ముందుకొచ్చాం. పలు ఇన్పూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వాలతో కలిసి ప్రజారోగ్యానికి పూనుకోవాలని నిర్ణయించుకొన్నాం. మధ్య తరగతి కుటుంబాలకు సరితూగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చాం అంటూ అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున ట్వీట్ చేశారు.

     పలు రాష్ట్రాల్లో తక్కువ ధరకే ఇన్సూరెన్స్

    పలు రాష్ట్రాల్లో తక్కువ ధరకే ఇన్సూరెన్స్

    అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించిన వీడియోను ఉపాసన షేర్ చేశారు. ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో మధ్య తరగతి ఎలా అండగా నిలుస్తున్నామనే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అందరికీ ఆరోగ్యం అందించడమే తమ లక్ష్యమని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Actor #Ramcharan ‘s wife UpasanaKamineniKonidela wants to help create a solution to help 50 crore middle income Indians who are not protected under government schemes for their medical needs. Affordable healthcare for all through sustainable schemes is her focus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X