Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Upasana: సమంతను చూసి నేర్చుకొంటున్నా.. పిల్లల్ని ఎందుకు కనడం లేదంటే.. మెగా కోడలు షాకింగ్‌గా
ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఒక స్టార్ హీరో కోడలు, మరొక స్టార్ హీరో భార్య, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన గురించి అందరికీ తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత ప్రేమ, తమ పిల్లల విషయం వంటి అనేక విషయాలను పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

పెద్దింటి అమ్మాయయినా..
పెద్దింటి అమ్మాయయినా సోషల్ సర్వీస్ చేస్తూ చురుగ్గా ఉంటారు ఉపాసన. వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉండే ఉపాసన అప్పుడప్పుడు మాత్రమే ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనేక విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ చాలామంది బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వారికి ఎలాంటి సమస్యలు ఉండవని అంటారు కానీ నిజానికి అలాంటి వాళ్లకి ఎన్నో సమస్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించారు

వ్యక్తిగత విషయం
నా సమస్య మీకు తెలియదు మీ సమస్య నాకు తెలియదు కానీ ఒకరి సమస్యలను ఒకరు గౌరవించుకోవాలి అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలిపారు. ఇక తమ పిల్లల గురించి ఆమె మాట్లాడుతూ అది తన వ్యక్తిగత విషయమని ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ఎక్కువ చేసి చూపిస్తుంది అని అన్నారు., వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదన్న ఆమె ఎవరేమైనా అనుకోని.. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను. ఆ టైం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతానని అన్నారు.

సమంతది నిజమైన ప్రేమదు
అలాగే 'చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తూ పక్కవారి ఆరోగ్యం కోసం పనిచేస్తుంటార కానీ ఇంట్లో ఉండే మహిళ ఒక్కసారి అనారోగ్యానికి గురైతే మొత్తం కుటుంబం అనారోగ్యంపాలైనట్లేనని అన్నారు. మహిళలు ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అప్పుడే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె అన్నారు. ఇక ఒక్క మహిళలలే కాకుండా ఎవరైనా ఖాళీగా ఉండకూడదని ఏదో ఒకటి నేర్చుకోవాలని లేదా.. పని చేస్తుండాలి' అంటూ చెప్పుకొచ్చారు.

సమంతది నిజమైన ప్రేమ
ఇక
నటి
సమంతతో
తనకున్న
అనుబంధాన్ని
పంచుకున్న
ఉపాసన..
సమంతలో
సాయం
చేసే
గుణం
ఉందని
సమంత
తనకు
ఎన్నో
విషయాల్లో
సహాయం
అందించారని
చెబుతూ
సమంతది
నిజమైన
ప్రేమ
అని
కూడా
కామెంట్స్
చేశారు.
సమంత
మా
వెబ్
సైట్
కోసం
రాసిన
ఆర్టికల్స్
ఎడిట్
చేసేంత
వరకు
తనకు
మాంసం
తినే
అలాటుందని,
తాను
తెలంగాణ
బిడ్డను
కాబట్టి
పండుగల
సమయంలో
మాంసం
తినేదానిని
కానీ..
సమంత
ఆర్టికల్స్
ఎడిట్
చేసిన
తర్వాత
మాంసం
తినడం
చాలా
వరకు
తగ్గించానని
చెప్పుకొచ్చారు.
Recommended Video

బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్
స్ట్రాంగ్ ఉమెన్ ను అబ్బాయిలు భరించలేరు అని చెబుతుంటారు కదా దానికి మీ సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించడంతో అందుకు ఉపాసన అదే ప్రశ్నను యాంకర్ ను అడిగారు. స్ట్రాంగ్ మెన్ ను ఒక ఉమెన్ భరించగలదా అని ప్రశ్నించగా అందుకు ఆమె మీరు భరిస్తున్నారు కదా అని సమాధానం చెప్పారు. అయితే తనకు ఉపాసన సమాధానం కావాలని అడగడంతో తన దృష్టిలో జెండర్పెద్ద విషయం కాదని చెబుతూ తన బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్ అని అయితే ఆమె అన్ని విషయాలలో ఎంతో చురుగ్గా ఉంటుందని ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించింది.