నువ్ నాకు అలా కనిపిస్తున్నావ్.. RRR పోస్టర్‌పై ఉపాసన షాకింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతీ ఏటా జరిపినట్టుగానే మెగా ఫ్యాన్స్ అందరూ సెలెబ్రేషన్స్‌ను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేశారు. ఈ వేడుకలకు ఆర్ఆర్ఆర్ బూస్టప్ ఇచ్చింది. తాజాగా అదిరిపోయే లుక్కును రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారాన్ని ఆర్ఆర్ఆర్ అందరికీ పరిచయం చేసింది.

అదిరిపోయిన పోస్టర్..
గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ టీం అందరినీ ఊరిస్తూనే వచ్చింది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త అవతారం చూడబోతోన్నారని చెబుతూ వచ్చింది. దానికి తగ్గట్టే అల్లూరిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్క పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సెలెబ్రిటీల రియాక్షన్..
ఆర్ఆర్ఆర్ నుంచి తాజాగా వచ్చిన పోస్టర్ మీద ట్వీట్ల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల వరకు అందరూ కూడా రామ్ చరణ్ కొత్త అవతారాన్ని చూసి షాక్ అవుతున్నారు. అదిరిపోయింది.. అద్భుతం అంటూ రకరకాలుగా ట్వీట్లు వేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్ ట్వీట్లు..
ఇక ఆర్ఆర్ఆర్ టీం మాత్రం రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు. నిర్మాణ సంస్థ అయిన డీవీవీ, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్ ఇలా అందరూ రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు. ప్రస్తుతం ఉపాపన ఈ కొత్త పోస్టర్ మీద చేసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

రాముడిలా కనిపిస్తున్నావ్..
రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వదిలిన పోస్టర్‌తో అందరూ షాక్ అయ్యారు. ఉపాసన అయితే ఏకంగా దేవుడితో పోల్చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు శ్రీ రాముడు గుర్తుకు వస్తున్నాడు అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











