Upasana Konidela: మెగా ఫ్యామిలీ కోసం లావణ్య స్పెషల్ ట్రీట్... థ్యాంక్యూ అంటూ ఉపాసన పోస్ట్

మెగా ఫ్యామిలీ నుంచి ఏ న్యూస్ వచ్చినా.. మెగా అభిమానులకు సంబరమే. ఇక ఇటీవల మెగా ఇంటికి కొత్త కోడలికి వెళ్లిన లావణ్య.. తన బాధ్యతలను నిర్వహిస్తునే.. సినిమాలు, సిరీసులతో బిజీగా ఉంది. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ కోసం ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మెగా పెద్ద కోడలు ఉపాసన కొణిదెల థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ ఫిదా కుర్రాడిని సైలెంటుగా ప్రేమలో దింపి.. పెళ్లి కూడా చేసేసుకుంది. ఇక వీరి 6 సంవత్సరాలు సీక్రెట్ గా లవ్ చేసుకుని... ఎట్టకేలకు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగవైభవంగా జరిగింది. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీలతో పాటు.. పలువురు సినీ సెలబ్రేటీల నడుమ వీరి పెళ్లి జరిగింది. ఇక ఇటీవల ఈ జంట హనీమూన్ ట్రిప్పుకు కూడా వెళ్లింది.

Upasana Konidela Thanks To Lavanya Tripathi For She Making Sankranthi Laddu Full Details Here

ఇక ప్రతి పండగను లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. న్యూ ఇయర్ ఫోటోస్ పంచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండుగ. ఈ పండక్కి అందరూ పిండి వంటకాలు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

Upasana Konidela Thanks To Lavanya Tripathi For She Making Sankranthi Laddu Full Details Here
ఇక పెళ్లి తర్వాత మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతి పండక్కి సున్నండలు చేసింది. ఇక లావణ్య సున్నండలు తయారు చేస్తుండగా.. పక్కన వరుణ్ తేజ్ ఉన్నాడు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోను పెద్ద కోడలు ఉపాసన షేర్ చేస్తూ.. మెగా కొత్త కోడలు మెగా ఫ్యామిలీ కోసం సున్నండలు చేస్తుందని రాసుకువచ్చింది.

ఇక లావణ్య ఆ పోస్టును షేర్ చేస్తూ.. థ్యాంక్యూ సూపర్ స్వీట్ పెద్ద కోడలు అంటూ రాసుకువచ్చింది. ఇక వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య చేసిన పోస్టుకు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడళ్లు అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లావణ్య, ఉపాసన కలిసి మెలసి ఉంటున్నారని మెగా ఫ్యాన్స్ సంబుర పడిపోతున్నారు.

Upasana Konidela Thanks To Lavanya Tripathi For She Making Sankranthi Laddu Full Details Here
ఇక లావణ్య మరోవైపు వెబ్ సిరీసులో నటిస్తుంది. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో కలిసి మిస్ ఫర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీసులో నటిస్తుంది. ఈ సిరీసు డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ సిరీసు నుంచి టీజర్ రిలీజ్ కాగా మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సిరీసు స్ట్రీమింగ్ వివరాలు త్వరలో ప్రకటించనుంది డిస్ని ప్లస్ హాట్ స్టార్. ఇక వీటితో పాటు.. పలు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X