అంబానీ పెళ్లి ఈవెంట్‌లో రామ్ చరణ్‌కు అవమానం.. బయటపెట్టిన ఉపాసన మేకప్ మ్యాన్!

ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతో మంది సెలబ్రిటీల మధ్య చాలా సందడి జరుగుతున్న ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రతీ వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవలే మెగా హీరో రామ్ చరణ్.. ముగ్గురు బాలీవుడ్ హీరోలతో కలిసి నాటు నాటు సాంగ్ కు వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ కాగా మరో కొత్త వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. తాజాగా ఉపాసన మేకప్ మ్యాన్.. ఈ వేడుకలో రామ్ చరణ్ కు అవమానం జరిగిందని చెప్పుకొచ్చింది. అందుకోసం తాను పార్టీ నుంచి వాకౌట్ చేసినట్లు కూడా వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ టాప్ రిచెస్ట్ మాన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతోన్న ఈ వేడుకకు అనేక మంది స్టార్ నటీనటీలు హాజరు అవుతున్నారు. అయితే అనేక మంది బాలీవుడ్ హీరోహీరోయిన్లు పాల్గొంటుండగా.. టాలీవుడ్ కు చెందిన మెగా హీరో రామ్ చరణ్ మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా భార్య ఉపాసనతో కలిసి ఆ పార్టీలో సందడి చేశాడు.

Upasana Makeup Artist Zeba Hassan Said Bollywood Hero Disrespectful Behaviour With Ram Charan Check Details

అయితే తాజాగా జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ హీరోలతో పాటు రామ్ చరణ్ స్టెప్పులు వేశాడు. అయితే అప్పుడే చెర్రీనీ స్టేజ్ మీదకు పిలుస్తూ.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారట. రామ్ చరణ్ ను అవమానిస్తూ స్టేజీ మీదకు పిలిచారట. అది జీర్ణించుకోలేని ఉపాసన కొణిదెల మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ఈ పార్టీ నుంచి వాకౌట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. చెర్రీని షారుక్ అలా అనడం తనకు అస్సలే నచ్చలేదంటూ వివరించింది.

షారుక్ ఖాన్.. ఇడ్లీ, వడ అని సంబోధిస్తూ.. రామ్ చరణ్ ను వేధికపై ఆహ్వానించడం అస్సలు నచ్చలేదంటూ జెబా హాసన్ వివరించింది. సందర్భం సరదాగానే ఉన్నప్పటికీ.. బాలీవుడ్ స్టార్ హీరో ఇలాంటి సూచనలతో సౌత్ స్టార్ హీరోను పిలవడం అగౌరవపరచడమేనని తెలిపింది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో... సౌత్ హీరోలు ఎవరైనా.. బాలీవుడ్ హీరోలను వడా పావ్, భేల్ పూరీ అని పిలిస్తే మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించింది.

Upasana Makeup Artist Zeba Hassan Said Bollywood Hero Disrespectful Behaviour With Ram Charan Check Details

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాను అస్సలే జీర్ణించుకోలేకపోయానని.. అందుకే పార్టీ నుంచి వాకౌట్ చేశానంటూ సోషల్ మీడియా వేధికగా వెల్లడించింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చెర్రీకి వచ్చిన రెస్పాన్స్ చూసి తట్టుకోలేక ఆయన అలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అగౌరవపరచడం అస్సలే సరైన పద్ధతి కాదని.. చెర్రీకి షారుక్ ఖాన్ సారీ చెప్పాలని మెగా హీరో ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి మరి దీనిపై అటు రామ్ చరణ్, ఇటు షారుక్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X