ఉపాసన కామినేని కాఫీ టిప్స్: వైరల్ అవుతున్న మెగాకోడలి కాఫీమేకింగ్ (వీడియో)
మెగా కోడలి గానే కాకుండా తన బిజినెస్ పనులను కూడా చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ కి హెల్త్ టిప్స్ కూడా బాగానే ఇస్తున్నారు. మెగా మావయ్య గారికోసం అత్తయ్య గారి సూచనలతో
Recommended Video

డబ్బులు ఎన్ని ఉన్నా జీవితంలో ఏదో వ్యాపకం ఉండాలి కదా.. అందుకేనేమో, సినీ హీరో రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన జిమ్ రంగంలోకి అడుగుపెట్టి మహిళా వ్యాపారుల జాబితాలో చేరిపోయారు. అంత బిజీలో ఉన్నా ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

సోషల్ మీడియాలో
తమ పర్సనల్ విషయాల గురించి.. అలాగే చెర్రీ సినిమాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

హెల్త్ టిప్స్ కూడా బాగానే ఇస్తున్నారు
మెగా కోడలి గానే కాకుండా తన బిజినెస్ పనులను కూడా చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ కి హెల్త్ టిప్స్ కూడా బాగానే ఇస్తున్నారు. మెగా మావయ్య గారికోసం అత్తయ్య గారి సూచనలతో ఒక వ్యక్తితో కాఫీని తాయారు చేయించారు.

సోషల్ మీడియాలో
అంతే కాకుండా సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియోను పోస్ట్ చేసి వివరణ ఇచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో కాఫీ తాగితే చాలా మంచిదని నిద్ర కూడా బాగా పడుతుందని వివరించింది. ఇక జిమ్ వర్కౌట్స్ చేసేముందు బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని సూచనలు కూడా ఇచ్చిందండోయ్.
అపోలో హెల్డ్ ఫౌండేషన్
ఇకపోతే ఉపాసన ఇలా ఫిట్నెస్ టిప్స్.. అపోలో హెల్డ్ ఫౌండేషన్ కు సంబంధించిన పనులను చూసుకుంటూ.. టైమ్ దొరికినప్పుడు మాత్రం రామ్ చరణ్ 'రంగస్థలం' సెట్స్ లో సందడి చేస్తోంది. మొన్ననే ఈ మెగా హీరోలందరూ లడఖ్ టూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ టూర్ కూడా ఉపాసనే ఆర్గనైజ్ చేసిందట.


Click it and Unblock the Notifications











