»   »  రామ్ చరణ్ ఫన్ సైడ్: క్రేజీ ఫిక్ పోస్ట్ చేసిన ఉపాసన !

రామ్ చరణ్ ఫన్ సైడ్: క్రేజీ ఫిక్ పోస్ట్ చేసిన ఉపాసన !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, ఉపానసన మధ్య రిలేషన్ షిప్ ఎంత బాగుటుంతో తాజాగా ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఒక్క ఫోటోతో తేలిపోయింది. అన్నట్లు రామ్ చరణ్ ను ఉపాసన ముద్దుగా 'మిస్టర్ సి' అని పిలుస్తుంది.

ఇటీవల రామ్ చరణ్ సోదరి శ్రీజ వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక సందర్భంగా వివిధ పనులను, ఈవెంట్లను రామ్ చరణ్, ఉపాసన కలిసి ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేసారు. అంతే కాదు వీరి ఇద్దరూ వేసుకున్న డ్రెస్సుల కలర్స్ కూడా భలే మ్యాచ్ అయ్యాయి. అయితే వీరు కావాలని అలా ఒకే రకం రంగుగల డ్రెస్సులు వేసుకోలేదట. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే అంటున్నారు ఉపాసన.

తాజాగా ఆమె శ్రీజ వివాహం సందర్భంగా తీసిన ఫోటో సెషన్ కు సంబంధించిన ఓ ఫోటో పోస్టు చేసింది. ఇద్దరూ కలిసి ఫోటో దిగుతుంటే రామ్ చరణ్ కుదురుగా ఉండక ఫన్నీగా ప్రవర్తించాడు. దీని గురించి ఉపాసన స్పందిస్తూ...'క్రేజీ ఫోటో. కెమెరాకుసరిగా ఫోజు ఇవ్వలేదు. రెగ్యుర్ గా ఇచ్చే విధంగా కాకుండా ఇలా ఫోజు ఇచ్చాడు. ఇది మిస్టర్ సి యొక్క ఫైన్ సైడ్. మా ఇద్దరి డ్రెస్సుల కలర్ కో ఆర్డినేషన్ అనుకోకుండా జరిగింది' అని ఆమె తెలిపారు.

ఆ విషయాలు పక్కన పెట్టి రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రామ్ చరణ్ తన తర్వాతి సినిమా 'థాని ఒరువన్' రీమేక్ కు సిద్ధమవుతున్నారు. ఈచిత్రానికి తెలుగులో 'ధ్రువ' అనే టైటిల్ పెట్టారు. మే 22 నుండి రామ్ చరణ్ షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. మరో వైపు తన తండ్రి చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఉపాసన పోస్టు చేసిన క్రేజీ పిక్

ఉపాసన పోస్టు చేసిన క్రేజీ పిక్


ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన క్రేజీ పిక్ ఇదే. రామ్ చరణ్ ఆమె ముద్దుగా మిస్టర్ సి అని పిలిచింది.

రేర్ ఫోటో

రేర్ ఫోటో


రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

జంట

జంట


ఈ ఫోటో చూస్తుంటే ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు కదూ...

సెల్ఫీ

సెల్ఫీ


ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ తన భార్యతో సెల్ఫీ తీసుకుంటున్న పిక్.

ఫేస్ బుక్

ఫేస్ బుక్


రామ్ చరణ్, ఉపాసన ఫేస్ బుక్ కార్యాలయంలో...

జాలీ ట్రిప్

జాలీ ట్రిప్


ఉపాసన, రామ్ చరణ్ కలిసి సరదాగా అలా జాలీ ట్రిప్ కు వెళ్లిన ఫోటో.

ఓటు

ఓటు


రామ్ చరణ్, ఉపాసన కలిసి ఓటేసినప్పటి ఫోటో...

శ్రీజ వివాహంలో..

శ్రీజ వివాహంలో..


శ్రీజ వివాహంలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.

రాధికతో..

రాధికతో..


నటి రాధికతో కలిసి రామ్ చరణ్, ఉపాసన..

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ దీక్ష దీసుకున్నప్పటి ఫోటో ఇది..

పార్టీలో...

పార్టీలో...


రామ్ చరణ్, ఉపాసన కలిసి ఓ పార్టీలో పాల్గొన్నప్పటి ఫోటో...

అత్తారింట్లో..

అత్తారింట్లో..


అత్తారింట్లో రామ్ చరణ్ తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో....

పార్టీలో

పార్టీలో


రామ్ చరణ్, ఉపాసన కలిసి ఓ పార్టీలో పాల్గొన్నప్పటి ఫోటో...

English summary
Upasana Kamineni unveiled the fun side of Ram Charan, who seem calm and composed usually. And, from a post read from her, we understand that she calls him 'Mr.C'. If you recall, everybody were adoring how Ram Charan and his wife Upasana were color coordinated in almost all the events during his sister, Srija's wedding. Apparently, it is learnt that it was a coincidence, after going through this throwback post from Upasana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X