ఉపాసన హైలెవల్ మీటింగ్... పాత గొడవలు రామ్ చరణ్‌ మరిచిపోవాలని రిక్వెస్ట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్‌కు దూరమై దాదాపు ఆరేళ్లయింది. 2012లో కొన్ని వివాదాల కారణంగా చెర్రీ ఈ పాపులర్ సోషల్ మీడియా మాధ్యమం నుంచి తప్పకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ట్విట్టర్ ముఖం చూడలేదు.

చాలా మంది అభిమానులు ఆయన మళ్లీ ట్విట్టర్లోకి రావాలని కోరుతున్నా... చెర్రీ మాత్రం అందుకు ఇష్టడటం లేదు. రామ్ చరణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు కాబట్టి ఆ బాధ్యతను ఆయన భార్య ఉపాసన తీసుకున్నారు. అతడి సినిమాలకు సంబంధించిన విషయాలు, ఇతర అంశాలు ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు.

ట్విట్టర్ కో ఫౌండర్‌తో ఉపాసన

కాగా... ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే సోమవారం ఢిల్లీ వచ్చారు. ఐఐటి స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పాత్రికేయులు, టెక్ దిగ్గజాలు, మరికొందరు ప్రముఖులతో సమావేశం అయ్యారు. జాక్ డోర్సే‌ను కలిసిన వారిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు.

ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన

ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన

జాక్ డోర్సే‌తో ఉపాసన, ఆమె తల్లి శోభన కామినేని డిన్నర్ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ... కొన్ని ఫోటోలు సైతం పోస్టు చేశారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే కొందరు అభిమానులు రామ్ చరణ్ గురించి రిక్వెస్ట్ చేయడం ప్రారంభించారు.

రామ్ చరణ్‌ నిర్ణయం మార్చుకోవాలి

ఆరేళ్ల క్రితం ట్విట్టర్లో జరిగిన గొడవలను రామ్ చరణ్ తన మనసులో నుంచి తీసివేయాలని, తిరిగి ట్విట్టర్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ట్విట్టర్ కో ఫౌండర్‌ను కలిసిన ఉపాసనకు ఈ మేరకు మెగా అభిమానుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

రామ్ చరణ్ ట్విట్టర్ వదలడానికి కారణం

రామ్ చరణ్ ట్విట్టర్ వదలడానికి కారణం

రామ్ చరణ్ 2012లో ట్విట్టర్ నుంచి వైదొలగారు. అందుకు కారణం ఈ సోషల్ మీడియా వేదికపై అప్పట్లో జరిగిన కొన్ని అనవసర డిస్క్రర్షన్లే అని అంటున్నారు. అప్పట్లో చెర్రీ చేసిన కొన్ని కామెంట్స్ ఓ టాలీవుడ్ దర్శక ప్రముఖుడిని ఉద్దేశించే అంటూ.... ప్రచారం జరిగింది. దీనిపై ట్విట్టర్లో తీవ్రమైన చర్చ జరుగడంతో మనస్తాపానికి గురైన రామ్ చరణ్ అకౌంట్ క్లోజ్ చేసినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X