చిరు, చెర్రీల ఫొటోకి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్: నాన్నా కొడుకూ సేమ్ టూ సేమ్

తాజాగా చిరు-చెర్రీల కాఫీషాప్ ఫోటో చూసిన చిరంజీవి కోడలు, చెర్రీ సతీమణి ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ తో తన, ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసింది.

Recommended Video

చిరు, చెర్రీల ఫొటోకి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్

ఈ మధ్య టాలీవుడ్ లో గుబురు గడ్డం ఫ్యాషన్ అయిపోయింది రావప చరన్, నితిన్, వరుణ్ తేజ్ ఇలా వరుస పెట్టి యువహీరోలంతా గడ్డాలు పెంచేస్తున్నారు. అయితే చెర్రీ గడ్డానికి రంగస్థలం కారణం అనుకోండి.. రంగస్థలం కోసం రామ్ చరణ్ పెంచిన గెడ్డం రేపో మాపో పోతుంది కానీ... మెగాస్టార్ ని మాత్రం వచ్చే యేడాదివరకు గెడ్డంతోనూ చూడబోతున్నాం. ఆయన నటిస్తున్న సైరా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వెళ్లింది కాబట్టి. ఇప్పుడు చిరు కూడా గుబురు గడ్డం లుక్ లోకి వచ్చేసాడు...

 ఒకే రకమైన గెడ్డంతో

ఒకే రకమైన గెడ్డంతో

ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఇద్దరూ ఒకే రకమైన గెడ్డంతో - ఒకే డ్రెస్‌తో మెగా హీరోలిద్దరూ కలిసి కనిపించారు కాబట్టి. ఎప్పుడు ఎక్కడంటే రామ్ చరణ్ తన తండ్రిని కాఫీ కోసం బయటికి తీసుకెళ్లాడు. కాఫీ షాప్ లో ఇద్దరూ కలిసి పిచ్చాపాటిగా మాట్లాడుకొంటూ సేద తీరారు.

నేను, నాన్న సేమ్ టు సేమ్

నేను, నాన్న సేమ్ టు సేమ్

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో చిరుతో ఉన్న ఫొటోను షేర్ చేసి మెగాభిమానులకు సంతోషాన్ని కలిగించారు. ‘‘నేను, నాన్న సేమ్ టు సేమ్. ఇద్దరం గడ్డం లుక్ లోనే, ఇది మాకు కాఫీ టైమ్. నాన్నగారితో ఆనందంగా ఇలా బయటికి వచ్చి కాఫీ త్రాగడం కోసం ఒప్పించాను" అంటూ రామ్‌చరణ్ ఈ ఫొటోని పోస్ట్ చేశాడు.

ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్

ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్

ఈ ఫోటోలో గుబురు గడ్డంతో తండ్రీ కొడుకుల దర్శనం మెగా అభిమానులను తెగ సంబర పరిచింది. ఈ ఫోటో అలా సోషల్ మీడియాలోకి వచ్చిందో లేదో ఇలా వైరల్ అయిపోయి షికార్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ ఫోటో చూసిన చిరంజీవి కోడలు, చెర్రీ సతీమణి ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ తో తన, ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఓ అమూల్యమైన బహుమతి

ఓ అమూల్యమైన బహుమతి

'అమ్మా నాన్నలతో ఇలా ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యమైన విషయం. తండ్రీ కొడుకుల మధ్య ఇది వెలకట్టలేని ఓ అమూల్యమైన బహుమతి. సినిమా గోల్స్‎లో తండ్రి ఎలాగ దూసుకెళ్తున్నాడో కొడుకు రామ్ చరణ్ కూడా అలాగే దూసుకెళ్తున్నాడు..' అంటూ ఉపాసన కామెంట్ చేసింది.

 ఉపాసన కామెంట్

ఉపాసన కామెంట్

తండ్రీ కొడుకుల అనుబంధంపై ఈమె చేసిన ఈ కామెంట్ అటు మెగా అభిమానుల మనస్సుదోచుకుంది. ఇప్పటికే ఈ ఫొటో, ఉపాసనా కామెంట్ జనాల్లో పిచ్చ క్రేజీగా తిరుగుతున్నాయ్. మామూలుగా చరణ్ ఫొటో పెడితేనే మురిసి పోయే అభిమానులు ఇప్పుడు ఒకే రకం డ్రెస్, లుక్‌లో ఇద్దరూ కనిపించేసరికి ఆనందం పట్టలేకపోతున్నారు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X