Klin Kaara: కూతురు ఫస్ట్ ఫొటో షేర్ చేసిన ఉపాసన.. 2 నెలలకే జాతీయ జెండాను ఎగరేస్తూ!

పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచం దృష్టిని మొత్తం తనవైపు తిప్పుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న ఈ మెగా హీరోకు మరింత ఉత్సాహాన్ని నింపేలా అతడి భార్య ఉపాసన కొద్ది రోజుల క్రితమే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అప్పటి నుంచి వీళ్ల ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాసన తమ కూతురు 'క్లింకారా' ఫొటోను షేర్ చేసింది. ఆ చిన్నారిని మీరు కూడా చూసేయండి మరి!

Upasana Shares Her Daughter Klin Kaara Independence Day Photos

మెగా ప్రిన్సెస్ రాకతో హ్యాపీ: వివాహం జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా జూన్ 20వ తేదీ తెల్లవారుజామున 1.49 గంటలకు మెగా ప్రిన్సెస్ ఈ వరల్డ్‌లోకి అడుగు పెట్టేసింది. దీంతో మెగా, కామెనేని ఫ్యామిలీలతో పాటు వాళ్ల అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు.

Upasana Shares Her Daughter Klin Kaara Independence Day Photos

అప్పటి నుంచే ట్రెండింగ్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో ఇరు కుటుంబాల్లో సంబరాలు మిన్నంటాయి. మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు, సెలెబ్రిటీల నుంచి చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ హవానే కనిపించింది. అంతేకాదు, ఈ చిన్నారి దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోయింది.

క్లింకారా.. చూపించలేదుగా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనకు జన్మించిన చిన్నారికి బారసాల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఊయలలో వేసిన రోజునే ఈ చిన్నారికి నామకరణం కూడా చేశారు. ఈ పాపకు 'క్లింకారా' అనే పేరును పెట్టారు. ఇక, ఈ పాపను అటు రామ్ చరణ్ కానీ, ఇటు ఉపాసన కానీ ఇప్పటి వరకూ చూపించలేదు.

Upasana Shares Her Daughter Klin Kaara Independence Day Photos

ఫొటో షేర్ చేసిన ఉపాసన: తమ అభిమాన హీరోకు జన్మించిన పాపను చూడాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ, క్లింకారా జన్మించి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ ఆమె ఫొటోను ఎవరూ షేర్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాల్లో క్లింకారా ఫస్ట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆ చిన్నారి ముఖం కనిపించకున్నా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

జెండాను ఎగరేసిన క్లింకారా: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన తల్లిదండ్రులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో క్లింకారాను తన అమ్మమ్మ ఎత్తుకుని ఉన్నారు. అప్పుడు ఆ రెండు నెలల చిన్నారి తన చిట్టి చేతులతో జెండాకు కట్టిన తాడును పట్టుకుని లాగుతుంది. ఈ ఫొటోలనే ఉపాసన తాజాగా షేర్ చేస్తూ 'క్లింకారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే' అంటూ చెప్పుకొచ్చింది.

Upasana Shares Her Daughter Klin Kaara Independence Day Photos

ఆశీర్వాదం.. గర్వపడుతూ: ఉపాసన తాజాగా షేర్ చేసిన క్లింకారా ఫొటోలకు నెటిజన్లు, సెలెబ్రిటీల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం క్లింకారా చిన్న వయసులోనే జెండాను ఎగరేస్తూ కనిపించడం గర్వంగా ఉందని చెబుతున్నారు. ఫలితంగా ఈ పిక్స్ తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X