ఉప్పూ, కారం లేదు.. రాంచరణ్‌కు ఇంకో దారిలేదు.. ఉపాసన వండింది తినాల్సిందే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. బోయపాటి మార్క్ లో సాగే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నాడు. రాంచరణ్ లుక్ వెనుక అతడి సతీమణి ఉపాసన శ్రమ కూడా ఉంది. ఉపాసన తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటోంది.

 కండలు తిరిగిన శరీరం

కండలు తిరిగిన శరీరం

వినయ విధేయ రామ చిత్ర ట్రైలర్ ఫాన్స్ ని బాగా కట్టుకుంటోంది. రాంచరణ్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా షర్ట్ లేకుండా శరీరంపై టాటూతో రాంచరణ్ అంతా జంక్ అంటూ చెబుతున్న డైలాగులు ఆకర్షిస్తున్నాయి. ఆజార్బైజాన్ లో ఆ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో ఇంకెంత రచ్చ ఉందొ అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 రాంచరణ్ లుక్ వెనుక

రాంచరణ్ లుక్ వెనుక

రాంచరణ్ ర్యాంబో తరహాలో ఉండే లుక్ వెనుక చాలా కష్టం దాగుందని ఇదివరకు ఆయన సతీమణి ఉపాసన తెలియజేసింది. రోజుకు నాలుగు గంటలు జిమ్ చేస్తూ ప్రత్యకమైన ఆహార నియమాలతో డైట్ చేసేవాడని తెలిపింది. షూటింగ్ సమయంలో రాంచరణ్ తీసుకునే ఆహారం విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ద చూపించేది. తాజగా ఆ వీడియోని పోస్ట్ చేసింది.

చరణ్ కోసం చేపల ఫ్రై

అజార్బైజాన్ లో షూటింగ్ లొకేషన్ లోనే ఉపాసన రాంచరణ్ కోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేసేది. వీడియోలో చూపినదాని ప్రకారం..షూటింగ్ లొకేషన్ పక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టుకుని వచ్చి ఫ్రై చేస్తోంది. కానీ అది నోరూరించే ఫ్రై కాదు. రాంచరణ్ డైట్ కోసం ఉప్పూ, కారం లేకుండా కేవలం ఆలివ్ ఆయిల్ తో మాత్రమే చేసింది. భారీ యాక్షన్ సీన్స్‌లో నటించేందుకు ఎనర్జీ కోసం ఈ ఫ్రై చేసినట్లు ఉపాసన తెలిపింది.

జనవరి 11న

జనవరి 11న

వినయ విధేయ రామ చిత్రం జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. వినయ విధేయ రామ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X