సితారతో ఉపాసన సందడి.. మరో పాపతో కలిసి స్పెషల్ విషెస్!
టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రామ్ చరణ్, చిరంజీవి పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఆసక్తి రేకెత్తించిన ఈ భామ ఇప్పుడు ఎక్కువగా తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా చిన్నపాటి వీడియో ఒకాదాన్ని షేర్ చేశారు.
అందులో ఆమె మహేష్ కుమార్తె సితార అలాగే మరో పాపతో కూర్చుని సరదాగా వెనక్కి వాలుతున్నట్టు చూపించారు. ఇక ఈరోజు మహేష్ కుమార్తె సితార, ఉపాసన ఇద్దరిదీ పుట్టిన రోజు కావడంతో ఉపాసన సితారకు విషెస్ చెబుతూ నా ట్విన్ కి హాపీ బర్త్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ ఉప్సీ నీకు కూడా హాపీ హాపీ బర్త్ డే అని పేర్కొంది. సితార తన అకౌంట్ నుంచి హ్యాపీ బర్త్ డే ఉప్సీ ఆంటీ అని పేర్కొనడం గమనార్హం.

ఇక ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోకి అభిమానులు, సినీ ప్రముఖులు లైకులు కొడుతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా తన సతీమణి ఉపాసన పుట్టినరోజు సందర్భంగా భార్యపై ఎంతో ప్రేమగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేశారు. తన అర్ధాంగికి అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర సందేశం కూడా పెట్టారు. అంతే కాక ఆయన ఉపాసనతో దిగిన ఓ పిక్ షేర్ చేశారు. ఉపాసన దాదాపు అందరి హీరోల భార్యలతో మంచి స్నేహ బంధం కలిగి ఉంటారు.


Click it and Unblock the Notifications











