twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సితారతో ఉపాసన సందడి.. మరో పాపతో కలిసి స్పెషల్ విషెస్!

    |

    టాలీవుడ్‌ టాప్ హీరో రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రామ్ చరణ్, చిరంజీవి పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఆసక్తి రేకెత్తించిన ఈ భామ ఇప్పుడు ఎక్కువగా తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా చిన్నపాటి వీడియో ఒకాదాన్ని షేర్‌ చేశారు.

     RajKundra Arrest : పూనం షాకింగ్ రియాక్షన్.. నా 'బాధ'కి ఇది సమయం కాదు! RajKundra Arrest : పూనం షాకింగ్ రియాక్షన్.. నా 'బాధ'కి ఇది సమయం కాదు!

    అందులో ఆమె మహేష్ కుమార్తె సితార అలాగే మరో పాపతో కూర్చుని సరదాగా వెనక్కి వాలుతున్నట్టు చూపించారు. ఇక ఈరోజు మహేష్ కుమార్తె సితార, ఉపాసన ఇద్దరిదీ పుట్టిన రోజు కావడంతో ఉపాసన సితారకు విషెస్ చెబుతూ నా ట్విన్ కి హాపీ బర్త్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ ఉప్సీ నీకు కూడా హాపీ హాపీ బర్త్ డే అని పేర్కొంది. సితార తన అకౌంట్ నుంచి హ్యాపీ బర్త్ డే ఉప్సీ ఆంటీ అని పేర్కొనడం గమనార్హం.

    Vijay Devarakonda: రచ్చ లేపాడుగా...ఒకే రోజున రెండు రికార్డులు! Vijay Devarakonda: రచ్చ లేపాడుగా...ఒకే రోజున రెండు రికార్డులు!

    upasana special birthday wishes to sithara ghattamaneni

    ఇక ఉపాసన షేర్‌ చేసిన ఈ వీడియోకి అభిమానులు, సినీ ప్రముఖులు లైకులు కొడుతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా తన సతీమణి ఉపాసన పుట్టినరోజు సందర్భంగా భార్యపై ఎంతో ప్రేమగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేశారు. తన అర్ధాంగికి అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర సందేశం కూడా పెట్టారు. అంతే కాక ఆయన ఉపాసనతో దిగిన ఓ పిక్ షేర్ చేశారు. ఉపాసన దాదాపు అందరి హీరోల భార్యలతో మంచి స్నేహ బంధం కలిగి ఉంటారు.

    English summary
    Mega Power Star Ram Charan's wife upasana has shared a special birthday wishes to Sitara Ghattamaneni, the daughter of actor Mahesh Babu. upasana said Happy happy birthday my birthday twin love u loads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X