ఉపాసన కాఫీషాప్.... చిరంజీవి స్పెషల్ డ్రింక్ కేవలం రూ. 20!
Recommended Video

మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు వివిధ వ్యాపారాలు చేస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా ఆమె ఓ కాఫీ షాప్ ప్రారంభించారు. ఈ కేఫ్ లో మామయ్య చిరంజీవి పేరుతో స్పెషల్ డ్రింక్ ఏర్పాటు చేయడం విశేషం.

థియేటర్ కేఫ్
ఈ కాఫీ షాపుకు ‘థియేటర్ కేఫ్' అని పేరు పెట్టారు. అపోలో ఫౌండేషన్ థియేటర్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దీన్ని ప్రారంభించడానికి ముహూర్తం పెట్టినట్లు ఉపాసన తెలిపారు.

చిరంజీవి పేరుతో స్పెషల్ డ్రింక్
జూబ్లీహిల్స్ లోని అపోలో ఫౌండేషన్ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఉపాసన ప్రారంభించిన ఈ కాఫీ షాప్ మెనూలో చిరుస్ ఫిల్టర్ కాఫీ పేరుతో స్పెషల్ డ్రింక్ కూడా చేర్చారు. దీని ధర కేవలం రూ. 20 మాత్రమే.

కాఫీ షాపులో ఇంకా ఏముంటాయి?
ఈ కాఫీ షాప్ లో ఇంకా హైదరాబాదీ కేసర్ రోజ్ టీ (రూ. 20), లుఖ్మి చికెన్/వెజ్(రూ. 30), లమాకాన్స్ వరల్డ్ ఫేమస్ సమోసా(రూ. 30), మిర్చి బజ్జి (రూ. 30) లభించనున్నాయి.

ఇక్కడ రిలాక్స్ అవ్వండి అంటూ ఉపాసన పిలుపు
తాము కొత్తగా ప్రారంభించిన కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వండి అంటూ ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఎంటర్టెన్మెంట్స్ కార్యక్రమాలు కూడా
అపోలో ఫౌండేషన్ థియేటర్లో తరచూ వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ నెలలో దాదాపు 14 షోలు ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలు కూడా ఉపాసన విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











