మీడియో రిపోర్టులకు ఉపాసన అప్ సెట్
రామ్ చరణ్ కాబోయే భార్య ఉపాసనా కామినేని పై గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రతీ రోజు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అత్యుత్సాహంతో ఆమె రామ్ చరణ్ కన్నా పెద్దదిగా కనిపిస్తోందంటూ నెగిటివ్ కామెంట్స్ చేయటం మొదలెట్టారు. అంతేగాక ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకోబోతోందంటూ రాస్తున్నారు. దానిపై ఆమె చాలా అప్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ఆమెను వాటిని పట్టించుకోవద్దని సెలబ్రేటీలకు ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పటం జరిగిందని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ మాత్రం రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నామా లేదా అనేది కాదు...రైట్ పర్శన్ ని చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి అన్నారు రామ్ చరణ్. మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటున్నానని భావిస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే కెరీర్ లో సెటిల్ కాని వారు పెళ్లి గురించి ఆలోచించరు. కానీ నేను రాబోయే ఇరవై ఏళ్ళ వరకూ నా కెరీర్ బావుంటుందనే భాటవిస్తున్నాను.ప్రస్తుతం నేను చాలా ఫోకస్ గా ఉన్నాను. ఇదే నా జీవితంలో నేను వివాహం చేసుకోవటానికి సరైన సమయం అని భావిస్తన్నాను అన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనిని వివాహ విషయమై తరుచుగా వార్తల్లో ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











