రామ్ చరణ్ మూవీ ఊసే తీయని ఉపాసన... టెక్కీలు, బేబీలతో సంక్రాంతి సంబరం!
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సంక్రాంతి వేడుకలను ఈ సారి భిన్నంగా జరుపుకున్నారు. తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఆమె... ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులో పొంగల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తన బిజినెస్ వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన.... ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వ్యవహారాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రస్తానం కొనసాగిస్తూ, భర్త రామ్ చరణ్‌తో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులో...
ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంది. వారితో ముచ్చటించాను. చాలా మంది ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఫిట్‌గా ఉండేదుకు ఆసక్తి చూపారు.... అని ఉపాసన తెలిపారు.
ఫ్రెండ్స్ లైక్ ఎ ఫ్యామిలీ
టెక్కీస్... బేబీస్‌తో చాలా చాలా సరదాగా గడిపాను. ఫ్రెండ్స్ లైక్ ఎ ఫ్యామిలీ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులోని హ్యాపీ మూమెంట్స్‌ను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

వినయ విధేయ రామ ఊసే తీయని ఉపాసన
‘వినయ విదేయ రామ' సినిమా రిలీజ్ ముందుకు వరకు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను, సెట్స్‌లో రామ్ చరణ్ వీడియోలను షేర్ చేసిన ఉపాసన... ఈ మూవీ విడుదలైన తర్వాత అసలు ఆ ఊసే తీయడం లేదు. కారణం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడమే అని తెలుస్తోంది.

బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఏమిటి?
బాక్సాఫీసు వద్ద ‘వినయ విధేయ రామ' పరిస్థితి పరిశీలిస్తే... ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్మగా... ఫస్ట్ వీకెండ్ రూ. 39.4 కోట్ల షేర్ రాబట్టింది. ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా లాభాలు ఆర్జించడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











