రాజన్నను వేడుకున్న రామ్ చరణ్ ఫియాన్సీ...!

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాబోయే భార్య ఉపాసన రాజన్న(శ్రీ రాజరాజేశ్వర స్వామి)ను దర్శించుకోవడానికి బుధవారం కరీంనగర్ జిల్లా‌లోని వేములవాడకు వచ్చారు. ఉపాసనతో పాటు ఆమె తల్లి కూడా రాజన్న దర్శనానికి వచ్చారు. వివాహం చేసుకునే ముందు రాజన్న ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఉపాసన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో అదే సెంటిమెుంటును కంటిన్యూ చేస్తూ వేములవాడ వచ్చినట్లు తెలుస్తోంది.

వీరి వివాహం మొయినాబాద్ ప్రాంతంలోని ఉపాసన ఫాం హౌజ్‌లో జూన్ 14న జరుగనుంది. ఇరు కుటుంబాల వారు రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వేడుక కోసం సినిమాలో మాదిరి భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించారు. ఇందుకోసం దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రామ్ చరణ్ తేజ్ తాత్కాలికంగా తన సినిమా షూటింగులకు బ్రేక్ వేశారు. 15 రోజుల ముందుగానే బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి, తదనంతర కార్యక్రమాలతో పాటు హనీమూన్ ట్రిప్ ముగిసే వరకు చెర్రీ సినిమాలుకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని చరణ్ త ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'Atlast free frm all the shoots till the wedding..' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X