twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇవాంకా ట్రంప్‌తో ఉపాసన: దృశ్యాలను ఆమెకే పంపిన రామ్ చరణ్, చిరంజీవి

    గ్లోబల్‌ ఎంట్రపెన్యూర్‌ సమ్మిట్‌(జీఈఎస్‌) సదస్సులో తను ఇవాంకా ట్రంప్ వెనుక కూర్చొని ఉన్న క్లిప్పింగ్‌ని తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు తనకు పంపినట్లుగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

    |

    మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ప్ర‌పంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల సదస్సు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరవడంతో హైదరాబాద్ అంతా హడావుడి వాతావరణం నెలకొంది.

     అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌

    అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌

    హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్‌ ఎంట్రపెన్యూర్‌ సమ్మిట్‌(జీఈఎస్‌)కు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తరలివచ్చారు. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ హోదాలో మెగా ఇంటి కోడలు ఉపాసన కూడా ఈ సదస్సులో ప్రసంగించారు.

     ప్రోత్సాహం కావాలి

    ప్రోత్సాహం కావాలి

    "మహిళలకు ప్రోత్సాహం కావాలి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేస్తున్నాయి. వారు అనుసరిస్తున్న విధానాలు ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అపోలో గ్రూప్‌‌లో మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలకు అవకాశాలు ఇస్తే ప్రపంచ స్థితిగతులనే మార్చేస్తారు" అంటూ చెప్పిన ఉపాసన ఆ సదస్సులో పాల్గొన్న దృశ్యాలు టీవీలో ప్రసారం అయ్యాయి.

    ఇవాంకా ట్రంప్

    ఇవాంకా ట్రంప్

    అయితే ఈ సదస్సులో తను ఇవాంకా ట్రంప్ వెనుక కూర్చొని ఉన్న క్లిప్పింగ్‌ని తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు తనకు పంపినట్లుగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. అంటే ఇక్కడ టీవీలో చూస్తూ ఆ వీడియోనే ఆమెకి పంపించారన్న మాట . ఇవాంకా వెనుక ఉపాసన ఉన్న క్లిప్‌ని పోస్ట్ చేసి..

     ఈ క్లిప్‌ని పంపించారు

    ఈ క్లిప్‌ని పంపించారు

    ఇవాంకా వెనుక ఉపాసన ఉన్న క్లిప్‌ని పోస్ట్ చేసి.. "మా మామయ్య, మిస్టర్ సిలు టీవీలో నేను కనిపిస్తున్న ఈ క్లిప్‌ని పంపించారు. పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని నమ్ముతున్న వారికి ధన్యవాదాలు'' అంటూ ఉపాసన హర్షం వ్యక్తం చేశారు.

    English summary
    None other than Upasana Konidela was seen at GES Summit 2017 today in Hyderabad HICC. where in Cameras focused on Upasana who was also seen sitting in the row of Ivanka Trump sat. So Megastar Chiranjeevi took a pic of Upasna and Ivaka in TV and sent the same to Upasana himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X