ఉపాసనపై ప్రేమను రామ్ చరణ్ ఇలా చూపాడు...!
హైదరాబాద్: రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భార్యపై తనకు ఉన్న అపారమైన ప్రేమను రామ్ చరణ్ ఈ సారి అందరికీ తెలిసేలా ప్రదర్శించాడు. తన చేతిపై ఉపాసన ముద్దు పేరు ‘ఉప్పి' అని రాయించుకున్నాడు. అయితే ఇది టాటూ కాదు. గోరింటాకుతో రాసింది. ఆదివారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ భవన్ లో జరిగిన ఫ్యాన్స్ మీటింగుకు రామ్ చరణ్ హాజరైనపుడు అతని చేతిపై ఈ గుర్తు కనిపించింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ చిత్రంలో ఐటం సాంగు కోసం హీరోయిన్ అంజలిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట శ్రీను వైట్ల. ఈ మేరకు ఆమెను సంప్రదించగా రూ. కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. హీరోయిన్ తో సమానంగా అమ్మడు ఐటం సాంగుకు డిమాండ్ చేయడంతో అంతా షాకయ్యారట. రెమ్యూనరేషన్ తగ్గించాలని సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.
ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, త్వరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరో వైపు గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ‘రేసు గుర్రం' సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కోసం అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల సినిమా, సురేందర్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ‘కిక్ 2' సినిమా పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











