రామ్ చరణ్ కి ఉపాసన...స్పెషల్ బర్తడే గిప్ట్

By Srikanya

హైదరాబాద్ : మార్చి 27 రామ్ చరణ్‌ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజుని పురస్కరించుకుని వారం ముందే ఆయన భార్య ఉపాసన ఓ ప్రత్యేకమైన పుట్టిన రోజు బహుమతిని అందచేసింది. అదేమిటంటే... ఓ కుక్కపిల్ల. రామ్‌చరణ్‌కి గుర్రాలన్నా, కుక్క పిల్లలన్నా ఇష్టం. ఆయన దగ్గర మేలుజాతి అశ్వాలు ఉన్నాయి. దాంతో ఆమె ఈసారి చరణ్‌ పుట్టినరోజుకి జాక్‌ రస్సెల్‌ జాతి కుక్కపిల్లని కానుకగా అందించారు.

ఈ కుక్క పిల్లని ఆమె థాయ్‌లాండ్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ స్వయంగా వెల్లడించారు.కానుక మాత్రం వారం రోజుల ముందే అందేసింది. గతేడాది తన శ్రీమతి ఉపాసనకు జన్మదిన కానుకగా ఖరీదైన మేలుజాతి అశ్వాన్ని బహుమతిగా ఇచ్చారు. దాంతో రామ్ చరణ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.

ఇక రామ్ చరణ్ అభిమానులకూ ఓ చిరు కానుక ఉంది. చరణ్‌ పుట్టిన రోజున 'ఎవడు', 'తుఫాన్‌' టీజర్లను హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా మీడియా వద్ద ఖరారు చేసారు. ఆ టీజర్స్ తో ఆయన తుఫాన్ సృష్టిచనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహిస్తారు.

ఈ విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ...''నాన్నగారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆయన పుట్టిన రోజు చేయలేకపోతున్నామనే వెలితి అభిమానులకు ఉంది. ఆ లోటు కాస్తయినా తీర్చడానికి ఈసారి అభిమానుల సమక్షంలో నా జన్మదిన వేడుకల్ని జరుపుకోవాలనుకొంటున్నాను'' అన్నారు.

రామ్ చరణ్‌ హిందీలో నటిస్తున్న 'జంజీర్‌' చిత్రానికి 'తుఫాన్‌' అనే పేరుపెట్టారు. నలభయ్యేళ్లనాటి 'జంజీర్‌'ను నేటి తరానికి తగ్గ విధంగా మార్చారు. నాటి చిత్రంలో హీరోగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ తాజా చిత్రంలో తళుక్కున మెరవబోతున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చేస్తోంది. అపూర్వ లఖియా దర్సకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X