లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : మే నెలలో వరసగా సినిమాలు భాక్సాఫీస్ మీద దూకనున్నాయి. ఆ సినిమాల్లో సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు ఉన్నారు. అలాగే ఒకే రోజు రెండు,మూడు రిలీజ్ లు అవబోతున్నాయి.

అన్నిటికన్నా క్రేజ్ రేపుతున్న చిత్రం ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ కావటం, దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం హిట్ అటం..ట్రైలర్స్ ఈ చిత్రంపై అంచనాలు రేపుతున్నాయి.

ఇక ఈ పోటీలో లవ్లీ,ప్రేమే కావాలి చిత్రాల హీరో ఆది..సుకుమారుడుపై మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు అశోక్.. పిల్ల జమీందార్ తర్వాత చేస్తున్న చిత్రం కావటం కూడా ఓ కారణం.

రిలీజ్ డేట్స్...వివరాలు స్లైడ్ షోలో..

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

సుకుమారుడు

అశోక్ దర్సకత్వంలో రెడీ అయ్యిన ఈ చిత్రం ఓ ఎన్నారై..ఇక్కడికి వచ్చి భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు పట్ల ఆకర్షితుడవటం అనే అంశం చుట్టు కథ జరుగుతుంది. ఆది హీరోగా చేసిన ఈ చిత్రం 10, మే, 2013 రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

తఢాఖా
తమిళ చిత్రం వెట్టై రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్నీ కిషోర్ కుమార్(డాలి) డైరక్ట్ చేసారు. నాగచైతన్య, సునీల్ హీరోలుగా చేసిన ఈ చిత్రం రీమేక్ అవటంతో మంచి క్రేజే ఉంది.

ఈ చిత్రం 10, మే, 2013 రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

ఇద్దరమ్మాయిలతో ...
పూరీ జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో దేశముదురు తర్వాత వస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ గా ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం 23, మే, 2013 రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

యాక్షన్ 3డి

అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న ఈ కామెడీ ఈ సమ్మర్ లో... గ్యారెంటీ హిట్ అవుతుందంటున్నారు. నిర్మాతే..దర్శకుడు కావటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఈ చిత్రం 31, మే, 2013 రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

సాహసం
గోపీచంద్, యేలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో మరో సారి తెరకెక్కిన ఈ చిత్రం ఎడ్వంచర్ ప్రధానాంసంగా సాగుతుంది. సాహసాలు నచ్చే అబిమానులకు ఈ సినిమా బాగా కిక్ ఇస్తుందంటున్నారు.
ఈ చిత్రం 31, మే, 2013 విడుదల అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

ఇంటింట అన్నమయ్య
శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడుని హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్రరావు రూపొందిస్తున్న చిత్రం ఇది. అన్నమయ్య సంకీర్తనలు గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు.

ఈ చిత్రం 31, మే, 2013 విడుదల అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

ప్రేమ కథా చిత్రమ్
ఈ రోజుల్లో దర్శకుడు మారుతి తాజా చిత్రం ఇది. మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా చేసిన ఈ చిత్రం హర్రర్ కామెడీ అని చెప్తున్నారు.

ఈ చిత్రం 7, జూన్ , 2013 న విడుదల ప్లాన్ చేసారు.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

బలుపు
రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీగా చిత్రం ఉంటుందంటున్నారు.

ఈ చిత్రం జూన్ మూడవ వారంలో రిలీజ్ అని చెప్తున్నారు.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

ఓం 3డి
కళ్యాణ్ రామ్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఖర్చు పెట్టి రీలాంచ్ ఫిలిం గా వస్తున్న చిత్రం ఇది.
ఈ చిత్రం జూన్ నాలుగవ వారంలో విడుదల అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

పైసా
కృష్ణ వంశీ, నాని కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మంచి పైసలు తెచ్చిపెట్టే చిత్రం అంటున్నారు.
ఈ చిత్రం జూలై రెండవ వారం లో విడుదల అవుతోంది.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

అత్తారింటికి దారేది
పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందంటున్నారు.

ఆగస్టు 7, 2013న ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

లేటెస్ట్ మూవీస్ ...రిలీజ్ డేట్స్ (ఫోటో ఫీచర్)

ఎన్టీఆర్...రామయ్య వస్తావయ్య

గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 9 న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X