2019కి స్వాగతం: కొత్త సంవత్సరం వేళ ప్రేక్షకులను ఊరిస్తున్న సినిమాలు!

ముందుగా అందరికీ 2019 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2018 తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదుఫలితాలను మిగిల్చి వెళ్లి పోయింది. కొందరు స్టార్స్ వరుస విజయాలతో వెలిగిపోగా... మరికొందరు విజయాలు లేక రేసులో వెనకబడిపోయారు. గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఈ కొత్త ఏడాది తెలుగు తారలంతా సరికొత్త టార్గెట్లతో బాక్సాఫీసు వైపు దూసుకొస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించి సినీ వినీలాకాశంలో మరిన్ని వెలుగులు పంచేందుకు సిద్ధమవుతున్నారు. 2019 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏమిటో ఓ లుక్కేద్దాం.

ఎన్టీఆర్-కథానాయకుడు

ఎన్టీఆర్-కథానాయకుడు

ఈ ఏడాది ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్-కథానాయకుడు'. స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎన్.బి.కె ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

2018లో ‘రంగస్థలం'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ కొత్త సంవత్సరం వేళ ‘వినయ విధేయ రామ' చిత్రంతో 2019 బాక్సాఫీసు రేసులో దూకుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. కియారా అద్వానీ కథానాయిక. జనవరి 11న ఈ మూవీ విడుదల కాబోతోంది.

 ఎఫ్ 2

ఎఫ్ 2

2019లో వస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్. విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మిస్టర్ మజ్ను

మిస్టర్ మజ్ను

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. ‘తొలి ప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీవెంటేశ్వర సినీ చిత్ర బేనర్ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ముద్ర

ముద్ర

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెరకెక్కుతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ముద్ర‌' ఈ నెలలోనే విడుదల కాబోతోంది. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. స‌మాజంలో సమస్యల పరిష్కారం విషయంలో మీడియా తీసుకుంటున్న బాధ్య‌త‌ను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్-మహానాయకుడు

ఎన్టీఆర్-మహానాయకుడు

స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎన్.బి.కె ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాత్ర

యాత్ర

స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర' ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.

ఎబిసిడి

ఎబిసిడి

అల్లు శిరీష్ హీరోగా 'ఏబిసిడి' (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఎబిసిడి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మహర్షి

మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ స్టార్ కెరీర్లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

జెర్సీ

జెర్సీ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 90 దశకంలో జరిగిన ఓ క్రికెటర్ జీవిత కథగా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

సైరా

సైరా

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి'తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం 2019 ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాహో

సాహో

బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న ‘సాహో' 2019 ఆగస్టు 15న విడుదల కాబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఇది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X