మెగా హీరో సినిమాలో ఉపేంద్ర.. క్యారెక్టర్ పై కూడా క్లారిటీ వచ్చేసింది!
కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సొంత భాషలో ఎలాగైతే క్రేజ్ అందుకున్నాడో అలాగే పరబాషలో కూడా ఈ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకున్నాడు. రా, ఉపేంద్ర, బుద్ధిమంతుడు అంటూ డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్నాడు.
ఒకానొక దశలో డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటించిన ఉపేంద్ర చాలా గ్యాప్ తరువాత తెలుగు తెరపై కనిపించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించలేదు ఈ సీనియర్ యాక్టర్. ఇక ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ ఒక తెలుగు సినిమా కూడా చేయబోతున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లు తెలుగులో ఎక్కువగా విలన్ రోల్స్ వచ్చాయని అందుకే చేయలేదని అన్నాడు. అయితే వరుణ్ తేజ్ సినిమాలో మాత్రం తనది నెగిటివ్ రోల్ కాదని చెప్పిన ఉపేంద్ర తన క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది కానీ నెగిటివ్ షేడ్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











