Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గ్రేట్ : హెచ్ఐవి బాలికను దత్తత చేసుకున్న హీరో
మైసూరు : నటుడు ఉపేంద్ర తెరమీదే కాదు ..నిజ జీవితంలోనూ రియల్ స్టార్ అనిపించుకున్నారు. మానవత్వాన్ని చాటుకున్నారు. హెచ్ఐవి బాధిత బాలికను దత్తత తీసుకున్నారు. ఆదివారం ఇక్కడి రాజేంద్ర కళామందిరలో స్థానిక అనంత భారత చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన 'వైరస్ రహిత' భారత్ జాగృతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
భార్య ప్రియాంకతో వచ్చిన ఉపేంద్ర బెళగావికి చెందిన హెచ్ఐవి బాధిత బాలిక (12)ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాన్ని సుత్తూరు మఠాధిపతి శివరాత్రి దేశికేంద్రస్వామి ప్రారంభించారు. మాజీ మంత్రి ఎస్.ఎ.రామదాస్, మేయరు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉపేంద్ర తెలుగులో హిట్టైన రవితేజ ...కిక్ చిత్రం కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. 'సూపర్ రంగ' టైటిల్ తో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. కె.మంజు సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత మంజు నిర్మిస్తున్న సూపర్ రంగ సినిమా విడుదలకు సిద్ధమైంది. డిటిఎస్ మెరుగుల్ని ఇటీవలే పూర్తి చేశారు. నెలాఖరు నాటికి తొలిప్రతి సిద్ధం కానుంది. వచ్చేనెలలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇందులోని ఓ పాటను యూరోప్‌లో చిత్రీకరించారు. ఉపేంద్ర, కృతి కర్బంద జంటగా నటించారు. రఘు ముఖర్జీ, ప్రియాంక, దొడ్డణ్ణ, రంగాయణ రఘు, బులెట్ ప్రకాష్, దయానంద్ ప్రధాన తారాగణం. ఫోటోగ్రఫీ- అశోక్ కశ్యప్, సంగీతం- అర్జున్ జన్య, దర్శకత్వం- సాధు కోకిలా.