నాగార్జునతో పాటు ఉపేంద్రను లాగారు
నాగార్జున రీసెంట్ గా జె.కె భారవి దర్సకత్వంలో రూపొందుతోన్న ఆది శంకర సినిమాలో అతిధి పాత్ర చేయటానికి కమిటైన సంగతి తెలిసిందే.తాజాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు.ఈ కన్నడ స్టార్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇక ఉపేంద్ర కథలో కీలకమైన రాజ అమృక పాత్రను చేయనున్నారు.కామసూత్ర గురంచి మందర ఓ సారి శంకరుడ్ని ప్రశ్న అడగగా ఆ విషయం తెలుసుకునేందుకు శంకరులు వారు అప్పటికే చనిపోయిన అమృత శరీరంలో ప్రవేసిస్తారు.
ఈ పాత్ర గురించి విన్న ఉపేంద్ర వెంటనే ఓకే చేసారు.ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ఎప్పటి నుంచో చారిత్రక నేపథ్యం ఉన్న ఓ సినిమాలో నటించాలని ఎదరుచూస్తున్నాను. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ఇందులో నేనో మహారాజు పాత్రలో కనిపిస్తాను అన్నారు. మరో ఇద్దరు హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామని భారవి చెప్పారు.
ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











