రజనీ గా 'ఉపేంద్ర'...తెలుగువారికి ఓ విచిత్రమైన ట్విస్టు

By Srikanya

'రజని'....'ఫ్రమ్ రాజమండ్రి' అనే టైటిల్ తో ఉపేంద్ర కన్నడంలో నటించిన ఓ హిట్ చిత్రం డబ్బింగై తెలుగులో దిగుతోంది. అక్కడ హిట్టైన సినిమానే కదా మనం చూడబోయేది అంటే ఇక్కడో ట్విస్టు ఉంది. ఈ చిత్రం తెలుగులో రవితేజ నటించిన కృష్ణ చిత్రానికి రీమేక్ కావటమే. ఈ విషయం దాచిపెట్టి డబ్బింగ్ నిర్మాతలు ఈ సినిమాని అనువాదం చేసి వదులుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని దేవీప్య మూవీస్ పతాకంపై పగడాల శివనారాయణ, బి. హనుమయ్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ..."ఉపేంద్ర కెరీర్‌లో వైవిధ్యమైన మాస్, యాక్షన్, లవ్‌స్టోరీ ఇది. కన్నడ ప్రేక్షకులకు మాదిరిగానే తెలుగువాళ్లనీ ఈ సినిమా బాగా అలరిస్తుంది. ఉపేంద్ర నటన, ఆర్తీ చాబ్రియా గ్లామర్, థ్రిల్లర్ మంజు స్టంట్స్ సినిమాకి ప్రత్యేకాకర్షణ" అని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తులసి, ముకుల్‌దేవ్ మరో రెండు ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: బి. హనుమయ్య, సినిమాటోగ్రఫీ: ఆర్. జనార్దన్‌బాబు, ఫైట్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: థ్రిల్లర్ మంజు.అలాగే ఉపేంద్ర సరసన ఈ చిత్రంలో ఆర్తీ చాబ్రియా హీరోయిన్ గా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X