కుళ్ళు రాజకీయాలపై సాఫ్ట్ వేర్ యువకుడి పోరాటం (ఉపేంద్ర పేరు లేని చిత్రం ప్రివ్యూ)
ఉపేంద్ర, నయనతార కాంబినేషన్ లో కన్నడంలో రూపొందిన పేరు లేని చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర సుభాష్ చంద్ర గాంధీగా కనిపిస్తాడు.అతనో ఎన్నారై.అతనికి మల్టీ బిలియన్ ఫౌండ్స్ తెచ్చిపెట్టే సాప్ట్ వేర్ కంపినీ లండన్ లో ఉంటుంది.అయితే అతనో దేశభక్తుడు.లండన్‌లో పుట్టి పెరిగినా భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో అతనికి గౌరవం.సామాజిక భాధ్యతతో కొనసాగే అతని క్యారెక్టర్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. అతను ఎప్పుడూ..మన ఇంటిని శుభ్రం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ మన వీధిపై ఉండదు. మన దేశం బాగుపడాలంటే మన ఇంటిపై ఎంత శ్రద్ధ పెడతామో, వీధిపై కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని చెప్తూంటాడు.అతనికి ఇందిర (నయనతార)పరిచయమవుతుంది.ఆమె చాలా సంప్రదాయబద్దమైన భారతీయ స్త్రీ.అయితే ఆమెకో పగ ఉంటుంది.దాంతోటే అతనికి ఇక్కడి డర్టీ పాలిటిక్స్ అర్దమవుతాయి.దాంతో వారిద్దరూ ఒక కొత్త భారతదేశాన్ని చూడాలనుకొంటారు.అందుకోసం ఏం చేశారు? 2030లో వాళ్లిద్దరూ చూసిన భారతదేశం ఎలా ఉంటుందనే విషయాల్ని తెరపైనే చూడాలి.ఈ సినిమా గురించి నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ..ఉపేంద్ర పదేళ్ల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది.వినోదం పుష్కలంగా ఉంటుంది.సామాజిక బాధ్యతతో కూడుకొన్న కథ.ఈ సినిమా చూశాక ప్రేక్షకులే పేరు నిర్ణయిస్తారు అన్నారు.
సంస్థ: రాక్‌లైన్ ప్రొడక్షన్స్
నటీనటులు: ఉపేంద్ర, నయనతార, తులిప్‌జోషి, సుదర్శన్, అలీ, జీవా, దండపాణి, సుధాకర్ తదితరులు.
నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్
రచన-దర్శకత్వం: ఉపేంద్ర


Click it and Unblock the Notifications











