నయనతారకు నరకం చూపించిన కన్నడ సూపర్ స్టార్
నయనతార రీసెంట్ గా కన్నడంలో సూపర్ (చేతి గుర్తు) అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఉపేంద్ర హీరోగా చేస్తున్నాడు. ఉపేంద్ర ఆమెతో సాడిజంగా బివేవ్ చేస్తూ మెంటల్ గానూ, ఫిజికల్ గానూ టార్చర్ పెట్టి ఆమెను సూసైడ్ చేసుకునే స్ధితికి తీసుకొచ్చే పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్రలో ఉపేంద్ర జీవించాడని, తను బాగా ఎంజాయ్ చేసానని నయనతార చెప్తోంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో కన్నడంలో విడుదల కాబోతోంది. అనంతరం తెలుగులో త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఉపేంద్ర గత చిత్రాలు ఓం, ఉపేంద్ర, ఎ తరహాలో ఈ చిత్రం కూడా విచిత్రమైన నేరేషన్ తో ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మల్టి లాంగ్వేజ్ లలో విడుదల చేయటానికే నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు.ఇక ఈ చిత్రం పోస్టర్స్ పై సూపర్ అని చేతితో చూపించే గుర్తు మాత్రమే ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి జానీ లాల్ కెమెరా, వి మనోహర్ సంగీతం అందిస్తున్నారు. ఇది ఓ యాక్షన్ ప్యాకెడ్ సినిమాగా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











