twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్నూ ఇలాగే ఇబ్బంది పెట్టారు, వ్యవస్థ ఏమైపోతుంది: కన్నడ హీరో ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    గత కొద్ది రోజులుగా పద్మావతి చిత్రంకి సంబంధించి ఏ రేంజ్ లో వివాదం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు పద్మావతికి బాసటగా నిలిస్తే , కొందరు రాజకీయ నాయకులు, కర్ణిసేనకి సంబంధించిన ఆందోళనకారులు పద్మావతి చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలో విడుదల చేయమని చెప్పుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పద్మావతిపై తన ఒపీనియన్ తెలియజేశాడు.

     పద్మావతి సినిమా విషయమై

    పద్మావతి సినిమా విషయమై

    పద్మావతి సినిమా విషయమై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఉపేంద్ర స్పందించారు. తాను కూడా ఓ చిత్ర విషయంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ...

    మనకు ఓ వ్యవస్థ ఉంది

    మనకు ఓ వ్యవస్థ ఉంది

    ఈ త‌ర‌హా అంశాలను ప్రశాంతంగా పరిష్కరించాలని ఉపేంద్ర కోరారు. గ‌తంలో త‌న సినిమా విడుద‌ల విష‌యంలో కూడా ఈ త‌ర‌హా వివాదాలు చుట్టుముట్టాయ‌ని చెప్పారు. ఓ ఆంగ్ల మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉపేంద్ర అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. మనకు ఓ వ్యవస్థ ఉంద‌ని, దాన్ని పాడుచేసుకుంటే సమాజం ఏమైపోతుంద‌ని ఉపేంద్ర ప్ర‌శ్నించారు.

     ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి

    ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి

    మనం చ‌ట్ట‌బ‌ద్ధంగా పాటించాల్సిన కొన్ని నిబంధనలున్నాయ‌ని, సినిమాల విష‌యంలో సెన్సార్‌ బోర్డు ఉంద‌ని చెప్పారు. నచ్చని విషయంపై నిరసన వ్యక్తం చేయ‌వ‌చ్చ‌ని, కానీ దేన్నైనా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి అన్నారు. ఆ చిత్ర దర్శకుడితో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, తాను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాన‌ని చెప్పారు.

    చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ు

    చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ు

    సామాజిక, చారిత్రక అంశాలపై సినిమాలు తీసేట‌పుడు కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు. తాను తీసిన ‘హెచ్‌2ఓ' చిత్రం విష‌యంలో చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని అన్నారు. 2006లో ‘ఐశ్వర్య'(తెలుగులో మ‌న్మ‌థుడు) అనే కన్నడ చిత్రంలో దీపికాతో క‌లిసి ఉపేంద్ర న‌టించారు.

    క‌ర్ణాట‌క‌లో ఉపేంద్ర కొత్త పార్టీ

    క‌ర్ణాట‌క‌లో ఉపేంద్ర కొత్త పార్టీ

    అయితే, కొద్ది రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లో ఉపేంద్ర కొత్త పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఉపేంద్ర చురుకుగా స్పందిస్తున్నారని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    English summary
    On Padmavati controversy, Kannada movie star Upendra said taking the law into one's hand only aggravates the problem in the society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X