ఉపేంద్రతో రవితేజ హిట్ చిత్రం రీమేక్

By Srikanya

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందించిన సూపర్ హిట్ చిత్రం కిక్. ఈ చిత్రం ఇప్పుడు కన్నడంలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర హీరోగా నటించటానకి రెడీ అవుతున్నాడు. ఇంద్రజిత్ లోకేష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. నిర్మాత కె.మంజు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మొదటి ఈ చిత్రం రైట్స్ ని మరో కన్నడ హీరో సుదీప్ కి చెందిన నిర్మాత ఎన్.కుమార్ తీసుకున్నారు.

పి.ఎన్ సత్య దర్శకత్వంలో సుదీప్ హీరోగా రమ్య హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని భావించారు. అయితే ఈ లోగా నిర్ణయం మార్చుకుని ఉపేంద్రతో చేయటానికి రంగం సిద్దం చేసారు. ఇక గతంలో ఉపేంద్ర, ఇంద్రజిత్ కలసి ఐశ్వర్య అనే చిత్రం చేసారు. తెలుగు నాగార్జున మన్మధుడు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే రవితేజ చేసిన కృష్ణ రీమేక్ లో కూడా గతంలో ఉపేంద్ర చేయటం విశేషం.

ఇక ప్రస్తుతం ఉపేంద్ర మంచి జోష్ లో ఉన్నాడు. మొన్న శుక్రవారం ఉపేంద్ర హీరోగా చేసిన కఠారి వీర..సుర సుందరాంగి చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కన్నడ మొదటి త్రీడీ గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ ఫాంటసీ గా చెప్తున్నారు. ఈ చిత్రం ఉపేంద్ర నరకం వెళ్లి అక్కడ చేసే విన్యాసాలతో నడుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని అప్పుడే నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉపేంద్ర సరసన ఈ చిత్రంలో రమ్య(దివ్య స్పందన)చేసింది. సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. తొలి పూర్తి కన్నడ త్రిడి చిత్రంగా ఇది ప్రచారం చేస్తున్నారు. ఉపేంద్ర ఈ చిత్రాన్ని తన గత హిట్ చిత్రం రక్త కన్నీరు కు సీక్వెల్ గా చెప్తున్నాడు. వెటరన్ ఆర్టిస్టు అంబరీష్.. యముడుగా ఈ చిత్రంలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే... ఉపేంద్ర ఓ కామన్ మ్యాన్. అతనికి ఎప్పుడూ కొత్త కొత్తగా ఆలోచించటం... రకరకాల రిస్క్ లు చేయటం అంటే ఇష్టం. అతను జీవితాశయం అండర్ వలర్డ్ డాన్ అవ్వాలని.. దాంతో అతను అండర్ వరల్డ్ లో జాయిన్ అవుతాడు. కొద్ది రోజుల్లోనే పేరున్న గ్యాంగస్టర్ అవుతాడు. అయితే అనుకోని పరిస్దితుల్లో గ్యాంగ్ వార్ లో అతను రైవల్ గ్రూప్ చేతిలో మరణిస్తాడు. అక్కడనుంచి అతను నరకానికి వెళ్లి యముడుని కలవడం అక్కడనుంచి జరిగే విన్యాసాలతో ఫన్నీగా చిత్రం నడుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X