Kabza రికార్డు ధరకు ఉపేంద్ర మూవీ హిందీ రైట్స్.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
కన్నడ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నది. కేజీఎఫ్, కంతార లాంటి చిత్రాల రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకొంటున్న కన్నడ సినీ పరిశ్రమ మరో ప్యాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సెన్సేషనల్ స్టార్ ఉపేంద్ర నటించిన కబ్జా చిత్రం రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఆర్ చంద్రూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకొంటున్నాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కబ్జా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి దర్శకుడు ఆర్ చంద్రూ ట్వీట్ చేస్తూ...

హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో కబ్జా ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. ఆ ఈవెంట్‌లో ఫస్ట్ లిరికల్ వీడియోను సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నాం అని ఆర్ చంద్రు ప్రకటన చేశారు. దీంతో ఈ సినిమా ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.

భారీ రేటుకు మ్యూజిక్ రైట్స్
కబ్జా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులు 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది.
హిందీ రైట్స్ రికార్డు ధరకు
ఇదిలా ఉండగా, కబ్జా రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదైంది. ఈ సినిమా హిందీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం మరో రికార్డుగా మారింది. హిందీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోవడంతో తెలుగు, తమిళ, మలయాళ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందనేది తాజా సమాచారం.

కబ్జాపై భారీ అంచనాలు
ఇక ఇంతకుముందు విడుదలైన కబ్జా సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. సుదీప్, శ్రీయ సరన్, కబీర్ సింగ్, నవాబ్ షా, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











