రామ్ గోపాల్ ని ఉద్దేశించేనా ఉపేంద్ర ఆ సెటైర్స్
నేను తీస్తూ పోతాను..చూస్తే చూడండి..లేకపోతే మానెయ్యండని తానెప్పుడూ ప్రేక్షకుల గురించి మాట్లాడననీ, చెత్త సినిమా తీస్తే ఒప్పుకుని,మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తానని ఉపేంద్ర రీసెంట్ గా ఓ పత్రిక వారితో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.ఈ వ్యాఖ్యలు విన్న మీడియావారు ఇవి రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి అన్నాడా అనే సందేహంలో పడ్డారు. ఎందుకంటే అలా బిహేవ్ చేసేది తెలుగులో కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమేనని అందరికి తెలిసిన విషయమే. అందులోనూ ఈ మధ్యన ఆయన తెలుగులో వరసగా చేసిన చిత్రాలు ఏవీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.అదేమి అని అడిగిన వారికి నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను..మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అని తేల్చి చెప్పారు.
అలాగే వెరైటీ పేరిట ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూడరనీ, పదేళ్ల క్రితం ప్రేక్షకుల మైండ్ సెట్ ఒకలాగుందనీ, ఇప్పటి మైండ్ సెట్ వారిలో ఇంకోలా వుందని ఉపేంద్ర అన్నారు. ఇక ఆయన తన లేటెస్ట్ చిత్రం గురించి చెప్తూ...నిత్యం వెరైటీని కోరుకుంటున్న ప్రేక్షకులు కొన్ని సందర్భాల్లో వెరైటీ సినిమాలని సైతం తిప్పికొడుతున్నారని అన్నారు. పేరులేని సినిమాతో తాను ప్రేక్షకుల ముందుకొస్తే దానికి కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనీ, తెలుగు, తమిళ ప్రేక్షకులు ఫర్వాలేదన్నారనీ, భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదని ఉపేంద్ర ఒప్పుకున్నారు. అసలు విషయాన్ని ఉపేంద్ర బయటపెట్టాడు.


Click it and Unblock the Notifications











