Kabzaa Twitter Review: ఉపేంద్ర 'కబ్జా'కు ఘోరమైన టాక్.. సేమ్ ఆ మూవీలా ఉందంటూ.. శ్రీయ నటనపై అలా!

కన్నడ విలక్షణ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఉపేంద్ర, A, ఓం పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన సినిమాలతో హీరోకు కొత్త అర్థం తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒకే మాట, కన్యాదానం వంటి చిత్రాలతో తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఇలా పలు చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్న ఆయన తాజాగా కబ్జా అనే సినిమాతో నేడు అంటే మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ సీనియర్ అండ్ గ్లామరస్ బ్యూటీ శ్రీయ సరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై నెటిజన్ల రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

సన్నాఫ్ సత్యమూర్తితో..

సన్నాఫ్ సత్యమూర్తితో..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందారు ఉపేంద్ర. ఆయన సినిమాలతో హీరోల క్యారెక్టరైజేషన్ లో కొత్త ఒరవడి సృష్టించారు. విచిత్రపు వేషధారణతో నెగెటివ్ లక్షణాలతో సరికొత్తగా హీరో పాత్రను ఆయన సినిమాల్లో పోషించారు. ఆయన సినిమాలకు కొద్దికాలం గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అప్పటికే తెలుగు చిత్రాల్లో నటించిన ఉపేంద్ర.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ రోల్ తో మరింతగా తెలుగు వారికి దగ్గరయ్యారు.

సీనియర్ నటుడు..

ప్రస్తుతం ఉపేంద్ర కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాకా తెరకెక్కిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా ఇందులో బ్యూటిఫుల్ శ్రీయ సరన్ హీరోయిన్ గా ఆకట్టుకోనుంది. అలాగే సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు.

136 నిమిషాల నిడివితో..

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. ఏడు భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 17న అంటే ఇవాళ విడుదల కానుంది. ఈ వారం విడుదలైన పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ కానుంది. 136 నిమిషాల నిడివి గల కబ్జా సినిమాపై నెటిజన్లు రివ్యూలు ఇచ్చారు.

మరోసారి గర్వపడేలా..


"కబ్జా మరొక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎల్డోరాడో సినిమా. ఆర్ చంద్రు దర్శకత్వం ఫెంటాస్టిక్ గా ఉంది. ఉపేంద్ర యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్. కిచ్చా సుదీప్ స్క్రీన్ ప్రజెన్స్ సూబర్బ్ గా ఉంటుంది. శివన్న సర్ప్రైజ్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కన్నడలో 2023 సంవత్సరంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా కచ్చితంగా నిలుస్తుంది" అని తెలిపిన నెటిజన్ 5కి 4.5 రేటింగ్ ఇచ్చాడు. "కబ్జా సినిమా శాండల్ వుడ్ ఇండస్ట్రీని మరోసారి గర్వపడేలా చేస్తుంది. నెగెటివిటీ అస్సలు పట్టించుకోవద్దు. కిచ్చ సుదీప్ కెమియో, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఫైర్ లా ఉన్నాయి" అని మరొక నెటిజన్ సంతోషం వ్యక్తం చేశాడు.

కెమియో పాత్రలు మాత్రమే..


"కబ్జా ఎబౌ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. సినిమాలో మెయిన్ హీరో ఉపేంద్ర ఒక్కడే. కిచ్చా సుదీప్ అండ్ శివన్న కేవలం 10 నుంచి 15 నిమిషాలు ఉండే కెమియో పాత్రలు మాత్రమే. కేజీఎఫ్ స్థాయిలో మాత్రం లేదు. కబ్జా సినిమా సేమ్ కేజీఎఫ్ లాంటి అనుభూతినే కలిగిస్తుంది" అని ఒక నెటిజన్ తెలిపాడు.

ఇంకాస్తా మెరుగ్గా..

"కబ్జా ఫస్టాఫ్ గుడ్. ఉపేంద్ర లుక్ బాగుంది. మిగతా వారి లుక్స్ కూడా బాగున్నాయి. బీజీఎమ్ అదిరిపోయంది. గ్రాఫిక్స్ ఇంకాస్తా మెరుగ్గా ఉండాల్సింది. స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంది. రెండో పార్టు కోసం ఎదురుచూస్తున్నా. క్యాస్టింగ్, కెమియో పాత్రలు, సంగీతం, బీజీఎమ్, సినిమా నిడివి, స్క్రీన్ ప్లే అన్ని ప్లస్ పాయింట్స్" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

అది నిరాశపరుస్తుంది..


"కబ్జా సినిమా మొత్తం ఉపేంద్ర షో. కిచ్చా సుదీప్ 10 నిమిషాల కెమియే నిరాశపరుస్తుంది. శ్రీయ సరన్ ఆకట్టుకుంది. ఒక్క సీన్ లో శివన్న (శివరాజ్ కుమార్) కనిపిస్తారు. కేజీఎఫ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. డల్ కలర్ టోన్. మ్యూజిక్ పర్వాలేదు. వీఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు. స్టోరీ నెరేషన్ ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేదు. సాధారణ గ్యాంగ్ స్టర్ మూవీ. క్లైమాక్స్ లో వచ్చే పార్ట్ 2కి లీడ్ ఇచ్చింది. మొత్తంగా యావరేజ్ మూవీ" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

 బయటకు వచ్చేయాలని..

బయటకు వచ్చేయాలని..


"బయటకు వచ్చేయాలనిపించింది. కేజీఎఫ్ 1, 2 చూస్తే కబ్జా చూడటం మానేయండి. కేజీఎఫ్ చీప్ వెర్షన్ లా ఉంది. సేమ్ అదే స్క్రీన్ ప్లే, అదే ఎడిటింగ్ ప్యాటర్న్. ఏమాత్రం ఎంగేజింగ్ గా లేదు. ఉపేంద్ర పర్ఫామెన్స్ బాగోలేదు. డబ్బింగ్ చెత్తగా ఉంది. సుధీప్ కేవలం కెమియో మాత్రమే. మిగతా నటీనటులది కూడా గొప్పగా ఏం లేదు" అని రాసుకొచ్చిన నెటిజన్ 5కి 2 రేటింగ్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X