గౌతమ్ నాకు చాలా క్లోజ్.. నమ్రత అయితే సితారను అలా నా చేతుల్లో పెట్టేశారు: ఉప్పెన దర్శకుడు
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన పైనే ఉంది. సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో గాని ట్రైలర్ తోనే అంచనాల స్థాయి మరో లెవెల్ కు వెళ్లింది. చూస్తుంటే సినిమా ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉందని ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తనకు చాలా క్లోజ్ అంటూ బుచ్చిబాబు వివరణ ఇచ్చారు.

సుకుమార్ స్టూడెంట్ గా..
దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అని అందరికి తెలిసిన విషయమే. కేవలం సినిమా పరమైన శిష్యుడే కాదు. సుకుమార్ అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా శిష్యుడే. పట్టుబట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సుకుమార్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్య 2 నుంచి అతను సుకుమార్ సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేస్తున్నాడు.

ఆయన సపోర్ట్ తోనే..
కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా కూడా సుక్కు సినిమాలకు వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అతని పాత్ర ఎంతగానో ఉంది. ఇక ఇండస్ట్రీలో తనతో పాటు తన అసిస్టెంట్స్ కూడా ఎదగాలి అనుకునే అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన సపోర్ట్ తోనే బుచ్చిబాబు మొదటి సినిమా సెట్స్ పైకి వచ్చింది.

మహేష్ బాబు ఫ్యామిలీతో..
ఇక మహేష్ ఫ్యామిలీతో రిలేషన్ పై కూడా బుచ్చిబాబు పాజిటివ్ కామెంట్ చేశారు. సుకుమార్ తో మహేష్ వన్ నేనొక్కడినే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా వర్క్ చేశారు. అయితే సినిమా ద్వారా కేవలం మహేష్ బాబే కాకుండా ఆయన ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అయ్యారని బుచ్చిబాబు తెలిపాడు.

ఆ విధంగా గౌతమ్ తో పరిచయం
మహేష్ బాబు తనయుడు గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఆ సినిమా కోసమని గౌతమ్ కు ఎక్కువ కనెక్ట్ అయ్యాము. షూటింగ్ చేయడానికి ముందు అతనికి కనెక్ట్ అవ్వాలని సుకుమార్ సార్ ఇద్దరు అసిస్టెంట్స్ ను మహేష్ ఇంటికి పంపేవారు. అందులో నేను ఒకడిని. ఆ విధంగా గౌతమ్ తో పరిచయం ఏర్పడింది.. అని బుచ్చిబాబు చెప్పాడు.

సితార పాపను నా చేతుల్లో పెట్టేశారు
ఇక సీతారా పాపను పుట్టినప్పుడే చూశాను అంటూ 1 నేనొక్కడినే సమయంలో సీతార జన్మించింది. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు పాప చాలా బావుందని అనుకున్నాను. అలా అనగానే నమ్రత గారు సీతార పాపను అలా నా చేతుల్లో పెట్టేశారు. అప్పుడే అనుకున్నాను ఉరికేనే ఎవరు కూడా గొప్పవాళ్ళు అవ్వరని, ఎదుటి మనిషికి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. అంటూ బుచ్చిబాబు తెలిపాడు.


Click it and Unblock the Notifications











