ఉప్పెనపై మహేష్ ట్వీట్.. ఆనందంతో ఎమోషనల్ అయిన డైరెక్టర్
ఉప్పెన సినిమా షూటింగ్ మొదలైనప్పుడు పెద్దగా అంచనాలు అయితే క్రియేట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే సినిమా ఫస్ట్ సాంగ్ నీ కన్ను నీలి సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పుడే ఉహీంచని విధంగా బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమా విడుదలైన తరువాత పాజిటివ్ టాక్ తో మూడు రోజుల్లోనే పెట్టినబడిని వెనక్కి తేవడమే కాకుండా ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు అందుకుంటోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు దర్శకులు ఉప్పెనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు కూడా సినిమాపై పాజిటివ్ గా ట్వీట్ చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు గర్వపడేలా చేశారని అన్నాడు. దీంతో బుచ్చిబాబు మహేష్ ట్వీట్ పై ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. నిజంగా ఇది గొప్ప ప్రశంస అంటూ ఉప్పెన సినిమా చూసిన తరువాత ఇలాంటి మంచి వర్డ్స్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉందని.. ఈ మాటలు నాకు నా హీరోకు చాలా స్పెషల్ అని చెప్పాడు.

ఇక ఇంతకంటే కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పలేనని..మీరు నిజంగా సూపర్ స్టార్, థాంక్యు సో మచ్ సార్ అని బుచ్చిబాబు వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు 1 నేనొక్కడినే సినిమాకు సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేశాడు. గౌతమ్ కు సంబంధించిన సీన్స్ మొత్తం బుచ్చిబాబు రాసారట. ఆ సినిమా నుంచే మహేష్, బుచ్చిబాబుకు కూడా చాలా క్లోజ్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











