ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ సినిమా.. అంతకు మించి అనేలా న్యూ ప్లాన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేటితరం దర్శకుల ఆలోచన ఆడియెన్స్ ఊహాలకందని రేంజ్ లో ఉంటోంది. కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ప్రేమ కథలను కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ ఫార్మాట్ లో వచ్చినదే ఉప్పెన సినిమా. దర్శకుడు బుచ్చిబాబు న్యూ డైరెక్టర్ అయినప్పటికీ సెన్సిటివ్ స్టోరీని వెండితెరపై చాలా ఎమోషనల్ గా చూపించాడు. ఇక ఈ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో ఒక రూమర్ వైరల్ గా మారింది.

మూడు రోజుల్లోనే..
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో రిలీజ్ కంటే ముందే మంచి బజ్ క్రియేట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా పాటలతోనే ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఉప్పెన సినిమా ఈ నెల 12న విడుదలవ్వగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది.

సుకుమార్ మాట నిజమయ్యేలా ఉంది
ఉప్పెన సినిమా రిజల్ట్ పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు రిలీజ్ కు ముందే భారీగా నమ్మకం ఏర్పడింది. తప్పకుండా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ను అందిస్తుందని చెప్పారు. సుకుమార్ అయితే ఏకంగా 100కోట్ల సినిమా అవుతుందని చెప్పాడు. ఇక సినిమా ఇప్పటికే 50కోట్లకు చేరువయ్యింది. చూస్తుంటే సుకుమార్ మాట నిజం చేసేలా ఉందని టాక్ వస్తోంది.

స్టార్ హీరోతోనే నెక్స్ట్ సినిమా
అయితే ఆ సినిమా విడుదలకు ముందే దర్శకుడు బుచ్చిబాబు మైత్రి వారికి మరొక కమిట్మెంట్ ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అది కూడా ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు దాదాపు అందరి హీరోలతో కూడా క్లోజ్ గా ఉన్నట్లు అతను ఇచ్చిన ఇంటర్వ్యూలతోనే అర్ధమయ్యింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నెక్స్ట్ సినిమా
ఇక బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. 1980 టైమ్ పీరియడ్ లో జరిగే ఆ కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న బుచ్చిబాబు త్వరలోనే ఒక స్టార్ట్ హీరోకు కథను వినిపిస్తాడాని తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అతనికి రెగ్యులర్ గా టచ్ లో ఉండే హీరో. దీంతో భవిష్యత్తులో ఎన్టీఆర్ తో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. మరి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాక్ ఎవరితో ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











