ఉప్పెన దర్శకుడు అప్పుడే రెండో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చేశాడు.. పెద్ద హీరోతోనే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకులు చా డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వారు ఎంచుకుంటున్న పాయింట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో ఎలాంటి బజ్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా పాటలతోనే ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది.
ఇక ఉప్పెన సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిజల్ట్ పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా భారీగా నమ్మకం ఏర్పడింది. తప్పకుండా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ను అందిస్తుందని అంటున్నారు. అయితే ఆ సినిమా విడుదలకు ముందే దర్శకుడు బుచ్చిబాబు మైత్రి వారికి మరొక కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా హిట్టయిన తరువాత మరో పెద్ద సినిమాను స్టార్ట్ చేస్తారట.

అది కూడా ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు దాదాపు అందరి హీరోలతో కూడా క్లోజ్ గా ఉన్నట్లు అతను ఇచ్చిన ఇంటర్వ్యూలతోనే అర్ధమయ్యింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అతనికి రెగ్యులర్ గా టచ్ లో ఉండే హీరో. దీంతో భవిష్యత్తులో ఎన్టీఆర్ తో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. మరి బుచ్చిబాబు ఉప్పెనతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











