జలజల జలపాతం రియల్ వీడియో.. ఆ సీన్లలో ఒకరిని మించి మరొకరు.. చివరలో భయపడిన కృతి శెట్టి
ఈ ఏడాది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఉప్పెన టాప్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను పరిచయం చేసిన ఈ సినిమా కృతి కెరీర్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న ఈ సినిమాలో ఓ వర్గం ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్న పాటల్లో జలజలపాతం ఒకటి. ఇక ఆ సాంగ్ మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకరిని మించి మరొకరు
వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి మొదటి సినిమా అయినప్పటికీ ఇద్దరు కూడా పెర్ఫామెన్స్ తో ఆదరగొట్టేశారు. ఒకరిని మించి మరొకరు ఎమోషనల్ సీన్స్ లలో కంటతడి పెట్టించారు. ఇక సినిమాలో ఎమోషన్ తో పాటు కంటెంట్ కు తగ్గట్లుగా ఉండే రోమాంటిక్ సన్నివేశాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

జలజల జలపాతం.. ఎంతో సెన్సిటివ్ గా
ఇక సినిమాలో ఓ వర్గం ఆడియెన్స్ కు ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన పాటల్లో జలజలపాతం ఒకటి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ లో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కథకు చాలా ముఖ్యమైన సాంగ్ కావడంతో వల్గారిటీ అనిపించకుండా బృందా మాస్టర్ చాలా సెన్సిటివ్ గా కంపోజ్ చేసిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.
నిధి అగర్వాల్ క్లీవెజ్ షో... అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరి

గ్రాఫిక్స్ ద్వారా
ఇక వీడియో సాంగ్ ఇటీవల విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ప్రస్తుతం 33 మిలియన్ల వ్యూవ్స్ కొనసాగుతొంది. అయితే పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. సాంగ్ ను ఒక స్విమ్మింగ్ ఫూల్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ ద్వారా సాంగ్ రూపురేఖలు మారిపోయాయి.
భయపడిన కృతి శెట్టి
సాంగ్ లో ఇద్దరు కూడా చాలా నేచురల్ గా నటించినట్లు తెలుస్తోంది. అయితే పడవ కదులుతున్న సమయంలో ఒక షాట్ లో కృతి నిలబడలేక భయపడిపోయింది. అయితే అంతమంది టెక్నీషియన్ల ముందు రొమాన్స్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. అందులోనూ కొత్తవాళ్ళు. నిజంగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి పెర్ఫెమెన్స్ తో పాటకు ప్రాణం పోసేశారు అనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











