Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నెట్‌ఫ్లిక్స్ లో ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎంతకు కొనుగోలు చేశారంటే?
2021 సినిమా ఇండస్ట్రీ ఎలా ముందుకు సాగుతుందో అని అనుకుంటున్న తరుణంలో క్రాక్ సినిమా ఇచ్చిన విజయం అందరికి ఒక సంతోషాన్ని ఇవ్వగా ఉప్పెన మాత్రం ఆ నమ్మకం యొక్క బలాన్ని మరింత పెంచింది. గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల ఓటీటీలోనే రావచ్చని అంతా భావించారు. కానీ నిర్మాతలు ఏ మాత్రం తొందరపడకుండా అంతా క్లియర్ అయిన తరువాతే రిలీజ్ చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టారు. ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్, కాస్ట్ వివరాల్లోకి వెళితే..
మీరెప్పుడూ చూడని శ్రీముఖి బ్యూటీఫుల్ ఫోటోలు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
12రోజులైనా తగ్గని హవా..
చాలా రోజుల తరువాత ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకి వస్తుండడంతో రిలీజ్ కు ముందే ఉప్పెనపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముందుగా చిత్ర యూనిట్ ఊహించినట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా సాలిడ్ వసూళ్లను అందుకుంది. సినిమా విడుదలై 12రోజులైనా హవా తగ్గలేదు. ఇప్పటికి కూడా ప్రతి రోజు కోటికి పైగా షేర్స్ అందుకుంటోంది.
20కోట్లకు పైగా ప్రాఫిట్స్
సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రిలీజ్ తరువాత సినిమా ఆడియేన్స్ అంచనాలను అందుకోవడంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది. 11 రోజుల్లో 44కోట్లకు పైగా షేర్స్ అందుకున్న ఉప్పెన 72కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ 20కోట్లు. ఇక నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి 21కోట్లకు షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బెస్ట్ డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మొదటి స్థానంలో నిలిచింది.
రిలీజ్ కు ముందే ఓటీటీ ఆఫర్స్..
ఇక సినిమా ఓటీటీ రిలీజ్ పై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. లాక్ డౌన్ లో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అవుతుండడంతో ఉప్పెన సినిమా కూడా అలానే రిలీజ్ అవుతుందని కూడా అంతా భావించారు. కానీ నిర్మతలు హీరో, హీరోయిన్ దర్శకుడి మొదటి సినిమా కావడంతో అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా రిస్క్ చేయలేదు.
రిలీజ్ ఎప్పుడంటే..
ఫైనల్ గా థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేసిన ఉప్పెన నెక్స్ట్ ఓటీటీ ఎంట్రీ కోసం సిద్ధమవుతోంది. ఇక ఏప్రిల్ 11న సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 7కోట్లతో సినిమా రైట్స్ ను అందుకున్నట్లు సమాచారం. మరి సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.