ఉప్పెన అభిమానులకు గుడ్ న్యూస్.. మీరు ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్గ్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. మొదటిసారి నటించిన వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టిలకు సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే కొత్త దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఈ సినిమా వల్ల మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
సుకుమార్ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించింది. నిర్మాతలకు బయ్యర్లకు నెవర్ బిఫోర్ అనేలా పెట్టినపెట్టుబడికి మంచి లాభాలు వచ్చాయి. రిపీట్ ఆడియెన్స్ ద్వారా కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

గత కొన్నిరోజులుగా ఉప్పెన ఓటీటీ రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. మొదట్లో ఏప్రిల్ తుది వారంలో రావచ్చని టాక్ వచ్చింది. కానీ ఆ రూమర్స్ నిజం కాదు. మొత్తానికి కొత్త డేట్ పై క్లారిటీ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. ఈ డేట్ లో ఎలాంటి మార్పులు లేవట. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











