Uppena Pre Release Event: చిరంజీవికి గ్రాండ్ వెల్‌కమ్.. హాల్లోకి అడుగుపెట్టగానే..
మైత్రీ మూవీస్ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఉప్పెన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి హాల్లోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేసి ఘనంగా స్వాగతం పలికారు.
Recommended Video

ముఖానికి మాస్క్ ధరించి చిరంజీవి హాల్లోకి హాజరుకాగానే అభిమానులకు అభివాదం చేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు. వేడుకకు హాజరైన నటీనటులను సాంకేతిక నిపుణులను అప్యాయంగా పలకరించారు. ప్రధానంగా విజయ్ సేతుపతిని కౌగిలించుకొని అభినందించారు. చిరంజీవికి కేటాయించిన సీటు నుంచి దూరంగా వెళ్తుంటే విజయ్ సేతుపతి చేయి పట్టుకొని పిలిచి పక్కనే కూర్చోపెట్టుకొన్నారు.

నటీనటులు: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సనా
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవి శంకర్
సినిమాటోగ్రఫి: షమాదత్ సైనుద్దీన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్స్: మౌనిక రామకృప్ణ
సీఈవో: చెర్రీ
సమర్పణ: సుకుమార్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్


Click it and Unblock the Notifications











