ఉప్పెన: ఆ విషయంలో సుకుమార్ చెప్పినా వినలేదట.. అందుకే క్లిక్కయ్యింది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు ఉప్పెన సినిమాపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సీరియస్ లుక్ లో విజయ్ సేతుపతి షాక్ ఇచ్చాడని వస్తున్న టాక్ పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తోంది.
నేడు విడుదలైన ట్రైలర్ తోనే సినిమాపై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్ర బాగా హైలెట్ అవుతోంది. ట్రైలర్ లోనే విశ్వరూపం చూపించాడు అంటే సినిమా మొత్తంలో ఇంకా ఏ రేంజ్ లో ప్రజెంట్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సుకుమార్ ఈ స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచి నమ్మకంతో ఉన్నాడట.

అయితే ఒక విషయంలో మాత్రం డైరెక్టర్ బుచ్చిబాబుకి అభ్యంతరం చెప్పాడట. అదే విజయ్ సేతుపతికి డబ్బింగ్ అరుంధతి రవి శంకర్ చెప్పడం అంతగా సెట్టవ్వదేమోనని అనుమానం వ్యక్తం చేశాడట. కానీ ట్రైలర్ కట్ చూసిన తరువాత ఆ పాత్ర యొక్క పవర్ ఏమిటో ఆ వాయిస్ ద్వారా అర్ధమయ్యింది. చాలా మంది విలన్స్ కు డబ్బింగ్ చెప్పిన రవి శంకర్ ఈ వెరీయేషన్ లో మాత్రం చెప్పలేదు. ఎక్కువగా అదే హైలెట్ అవుతోంది. మరి సినిమా మొత్తంలో ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











