డైరెక్టర్ కళ్లలో కళ్లు పెట్టి చూసిన యాంకర్ సుమ.. ఆ ఇద్దరితో పీక్స్‌లో రొమాన్స్
యాంకర్ సుమ పంచ్ వేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ సుమకే పంచ్ వేస్తే మాత్రం అది కచ్చితంగా హైలెట్ అవ్వాల్సిందే. అలా ప్రస్తుతం సుమకు పంచ్‌ల మీద పంచ్‌లు పడ్డాయి. అది కూడా ఎంతో సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లేలా కనిపించే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన కౌంటర్లు వేయడం మరో విశేషం. ఉప్పెన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుమ నిర్వహిస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో పాల్గొన్నారు.

సుమ షోలో రచ్చ..
యాంకర్ సుమ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్‌లో ఎంతగా సందడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. షోలో వచ్చిన గెస్ట్‌లను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. అలాంటి సుమకు ఇప్పుడు ఉప్పెన దర్శకుడు షాక్ ఇచ్చాడు. ఉప్పెన టీం చేసిన సందడికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ప్రమోషన్స్‌లో బిజీగా..
ప్రస్తుతం ఉప్పెన టీం ప్రమోషన్స్‌లో ఎంతో బిజీగా ఉంది. ఫిబ్రవరి 12న రాబోతోన్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రంగంలోకి దిగింది. హీరో హీరోయిన్ దర్శకుడు ఎప్పుడూ కూడా మీడియా ముందే ఉంటున్నారు. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా వీరి ఇంటర్వ్యూలో కనిపిస్తున్నాయి.

అలా ఎంట్రీ..
మొత్తానికి ఉప్పెన టీం సుమ షోలో ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై ఉప్పెన టీం దుమ్ములేపేందుకు రెడీ అయినట్టుంది. ఇందులో భాగంగా సుమకే డైరెక్టర్ బుచ్చిబాబు సెటైర్ వేశాడు. ఉప్పెన టీంతో సుమ పాట కూడా పాడించింది. ఆ పాట మధ్యలో వచ్చిన యాంకర్ రవి వచ్చి రచ్చ చేశాడు.

కళ్లలోకి కళ్లు..
ఉప్పెన సినిమాలో కళ్లు బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. ఇటు హీరోయిన్ అటు హీరో కళ్లపైనే అందరి దృష్టి పడింది. అందుకే హీరో హీరోయిన్లను కళ్లలో కళ్లుపెట్టి చూడమని టాస్క్ ఇచ్చింది సుమ. ఆ తరువాత సుమ డైరెక్టర్ ఇద్దరూ కూడా అదే ఫీట్ చేశారు. కానీ సుమ మాత్రం ఎక్కువ సేపు అలా చూడలేకపోయింది. కానీ హీరో హీరోయిన్లు మాత్రం కళ్లతోనే రొమాన్స్ చేసేశారు.

పంచ్ అదుర్స్..
పాట పాడమని అంటే బెదిరిపోయిన బుచ్చిబాబుకు రవి కౌంటర్ వేశాడు. నేను ఉన్నాను సర్ అంటూ రవి అంటే.. నేను కూడా ఉన్నాను అంటూ సుమ మరో సెటైర్ వేసింది. మీరు ఉన్నారు కానీ ఎవరి వైపు ఉన్నారంటూ? బుచ్చిబాబు కౌంటర్ వేశాడు. మీరు ఇక్కడ ఉన్న వారందరి కంటే సీనియర్ అంటూ సుమపై మరో కౌంటర్ వేశాడు.


Click it and Unblock the Notifications











