»   » క్యూ కట్టారు: సల్మాన్ ఖాన్‌కు పరామర్శల వెల్లువ (ఫోటోస్)

క్యూ కట్టారు: సల్మాన్ ఖాన్‌కు పరామర్శల వెల్లువ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయ పడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే అతనికి రెండు రోజుల తాత్కాలిక బెయిల్ లభించడం కాస్త ఊరట నిచ్చే అంశం. సల్మాన్ ఖాన్ జైలు నుండి తన గెలాక్సీ అపార్టుమెంటుకు చేరుకున్న వెంటనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. సల్మాన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బుధవారం రాత్రి సల్మాన్ ను చూసేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రీతి జింతా, సోనాక్షి సిన్హా, రాణి ముఖర్జీ, సంగీత బిజిలానీ, సునీల్ శెట్టి, సోనూ సూద్, పుల్ కిత్ సమ్రాట్ ఆయన నివాసినికి చేరుకుని పరామర్శించారు. తాజాగా గురువారం ఉదయం అమీర్ ఖాన్ సల్మాన్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.

సల్మాన్ ఖాన్ కోర్టుకు వెళ్లడానికి ఒక రోజు ముందే ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సల్మాన్ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ నేరం చేసి జైలు కెళ్లినా...... బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు మాత్రం అతన్ని నేరస్తుడిగా చూడక పోవడం....సాధారణ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్లైడ్ షోలో ఫోటోలు...

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా


కోర్టు తీర్పుకు ముందు, కోర్టు తీర్పు తర్వాత కూడా సోనాక్షి సల్మాన్ ఖాన్ ను కలిసి పరామర్శించింది. సల్మాన్ దబాంగ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ అతన్ని గురువుగా భావిస్తుంది.

సోనూ సూద్

సోనూ సూద్


సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రం తర్వాత సోనూసూద్ కెరీర్ మలుపు తిరిగింది. ‘బంగారం లాంటి మనసున్న వ్యక్తి. ఆయన మనసు ధృడంగా ఉంటుంది. ఆయన చేసిన మంచి పనులు వృధా కావు' అని ట్వీట్ చేసారు.

రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీ


సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉండే వారిలో రాణి ముఖర్జీ కూడా ఒకరు. ఆము బుధవారం రాత్రి సల్మాన్ నివాసానికి చేరుకున్నారు.

సునీల్ శెట్టి

సునీల్ శెట్టి


బాలీవుడ్ సినీ పరిశ్రమలో సల్మాన్ ఖాన్ సన్నిహితుల్లో సునీల్ శెట్టి కూడా ఒకరు. ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలుగుతారు. అతను సల్మాన్ కలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

డైసీ షా

డైసీ షా


సల్మాన్ ఖాన్ ‘జై హో' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న భామ డైసీ షా. సల్మాన్ కేసులో తీర్పు అనంతరం ఆమె అతన్ని కలిసి పరామర్శించింది.

బిపాసా బసు

బిపాసా బసు


సల్మాన్ ఖాన్ ఎంతో మంచి వాడని, అతని బాగు కోసం ప్రార్థన చేసినట్లు తెలిపింది. సల్మాన్ జైలు నుండి ఇంటికి చేరుకోగానే ఆమె వెళ్లి పరామర్శించింది.

నిఖిల్ ద్వివేది

నిఖిల్ ద్వివేది


బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేది కూడా సల్మాన్ ఖాన్ జైలు నుండి ఇంటికి చేరుకోగానే వెళ్లి పరామర్శించారు.

సంగీత బిజిలానీ

సంగీత బిజిలానీ


ఒకప్పుడు సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా మెలిగిన వారిలో సంగీత బిజిలానీ ఒకరు. ఇద్దరూ అప్పట్లో పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. సల్మాన్ జైలు నుండి ఇంటికి రాగానే వెళ్లి పరామర్శించారు.

ప్రీతి జింతా

ప్రీతి జింతా


సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉండే వారిలో ప్రీతి జింతా ఒకరు. సల్మాన్ కేసు తీర్పు ముందు, అతను జైలు నుండి వచ్చిన తర్వాత వెళ్లి పరామర్శించారు.

పులకిత్ సామ్రాట్

పులకిత్ సామ్రాట్


బాలీవుడ్ యువ నటుడు పులకిత్ సామ్రాట్ కూడా సల్మాన్ ఖాన్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

నికితిన్ ధీర్

నికితిన్ ధీర్


సల్మాన్ ఖాన్ ను తన గురువుగా చెప్పుకునే నికితిన్ ధీర్ కూడా సల్మాన్ ఖాన్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


2 రోజుల బెయిల్ దొరకడంతో ఆర్థర్ రోడ్ జైలు నుండి ఇంటికి తిరిగి వస్తున్న సల్మాన్ ఖాన్.

English summary
Salman Khan getting convicted was as it is heartbreaking, with the actor getting sentenced to 5 years in jail, I no longer know how to react. I totally agree with the judge's verdict, if he is really guilty of the charges made then he deserves to go to jail and justice is served to those people who suffered because of him.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu