»   »  ఆ ఫోటోల లీక్‌పై మీడియాకు కత్రినా బహిరంగలేఖ

ఆ ఫోటోల లీక్‌పై మీడియాకు కత్రినా బహిరంగలేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి ఇటీవల విదేశాల్లోని వెకేషన్‌కి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కత్రినా బికినీలు వేసుకుని రణబీర్‌తో కలిసి తిరగడం, పార్టీలో మునిగి తేలిన ఫోటోలు మీడియాకు లీకయ్యాయి. ఓ మేగజైన్లో ఆ ఫోటోలు ప్రచురితం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రణబీర్‌తో అత్యంత రహస్యంగా సాగించిన వెకేషన్ వివరాలు ఫోటోలతో సహా బయట పడటంతో ఖంగుతిన్న కత్రినా.....తన పర్సనల్ విషయాలు అనుమతి లేకుండా బయట పెట్టే హక్కు మీకెక్కడిది అంటూ మీడియాపై మండి పడింది. ఈ మేరకు మీడియా వారికి బహిరంగ లేఖ సంధించింది.

నేను చాలా అప్‌సెట్ అయి ఈ లేఖ రాస్తున్నాను. నా ఫోటోలు అనుమతి లేకుండా తీసారు. ఓ మేజగన్ల్ ప్రచురించారు. ఆ ఫోటోలను ఇతర మీడియా వారు కూడా క్యారీ చేసారు. నేను ఎవరితో హాలిడేకు వెళితే మీకెందుకు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నా అనుమతి లేకుండా నా ఫోటోలు తీసి వాటిని కమర్షియల్ గా వాడుకునే హక్కు మీకెక్కడిదంటూ కత్రినా మండి పడింది.

పాత్రికేయుల్లో కొందరు తమ విలువలకు తిలోదకాలు ఇచ్చి హద్దులు దాటుతున్నారు. సెలబ్రిటీల గురించిన విషయాల్లో అతిగా వ్యవహరిస్తున్నారు. ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. నేను మీడియాతో ఎప్పుడూ మంచి రిలేషన్ ఉండాలని కోరుకుంటాను. వెంటనే ఆ ఫోటోలతో రాద్దాంతం చేయడం ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని కత్రినా తన లేఖలో పేర్కొంది.

English summary
Katrina Kaif is very upset with her leaked bikini pictures. The diva feels betrayed and thinks that the media has encroached on her personal space by printing photographs of Ranbir Kapoor and her, on vacation. Katrina has issued an open letter to the media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu