twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    National Film Awards 2019: బాక్సాఫీస్‌నే కాదు అవార్డులను కూడా కుమ్మేసిన 'యూరి'

    |

    భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. జూరీ కమిటీ వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జయదేకర్ నివేదిక అందించారు. ఈ 66 వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది.

    ఈ అవార్డుల్లో ఒకే సినిమాకు గాను 4 అవార్డులు లభించాయి. ఆదిత్య దార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూరి' చిత్రానికి నాగులు కేటగిరీల్లో అవార్డులు లభించడం విశేషం. బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో వేరువేరుగా 4 అవార్డులు సొంతం చేసుకుంది 'యూరి' మూవీ. చిత్రంలో హీరోగా నటించిన విక్కీ కౌశల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించుకున్నాడు. 2019 జనవరి నెలలో విడుదలైన ఈ సినిమా సక్సెస్ సాధించింది.ఈ ఏడాది బాక్సాఫీస్‌ కలెక్షన్స్ జోరు కొనసాగించింది యూరి మూవీ. కబీర్ సింగ్ కంటే ముందు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది యూరి సినిమా.

    Uri got 4 awards in National Film Awards

    ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'మహానటి'ని ఎంపిక చేసింది జూరీ సభ్యుల కమిటీ. 'మహానటి' సినిమాకు జాతీయ పురస్కారం దక్కినట్లుగా ప్రకాష్ జయదేవకర్ ప్రకటించారు. అదే విధంగా ఇదే చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది 'మహానటి' సినిమా.

    English summary
    66th National Film Awards announced today. The juries have presented their reports to Information and Broadcasting Minister Prakash Javadekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X