twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవి హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్... ఎన్నికల వాతావరణాన్ని వేడిక్కిస్తున్న రంగీలా భామ

    |

    90 దశకాల్లో గ్లామర్ తారగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఊర్మిలా మతోంద్కర్ రాజకీయ బరిలోకి దూకారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎంపీ, బీజేపీ నేత గోపాల్ శెట్టిని ఆమె ఎదుర్కోబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతీ రోజు వేలాది కార్యకర్తలను కలుసుకొంటూ హాట్ హాట్ ప్రసంగాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా ముంబై ప్రచారంలో చేసిన ఆమె వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారుతున్నాయి. ఊర్మిళ ప్రసంగంలో కొన్ని కామెంట్లు...

    నటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ

    నటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ

    బాలీవుడ్‌లో నాకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టాను. ఓ నటిగా ఓటర్ల వద్దకు వెళ్లడం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రతీ ఒక్క ఓటరును కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎన్నికల ప్రచారం నాకు కొత్త అయినప్పటికీ.. రాజకీయాల్లో రాణిస్తాననే నమ్మకం కలుగుతున్నది అని ఊర్మిళ అన్నారు.

    ప్రజలకు నమ్మకం కలిగించేందుకు

    ప్రజలకు నమ్మకం కలిగించేందుకు

    ప్రజలకు మరో సినీ తార వస్తుందనే ఆలోచనను రానివ్వడం లేదు. ప్రజలకు మేలు చేసే నేత అనే నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రజల నమ్మకాన్ని నేను పొందుతానని బలంగా విశ్వసిస్తున్నాను అని ఊర్మిళ పేర్కొన్నారు.

    ప్రజా సమస్యల కోసమే

    ప్రజా సమస్యల కోసమే

    నా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సొంత ఇళ్లు లేవనే విషయాన్ని గ్రహించాను. నేను ఎన్నికైతే వారికి ఆ సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తాను. అనేక ప్రాంతాలు మురికిమయంగా ఉన్నాయి. మహిళల ఆరోగ్యం, లోకల్ ట్రైన్ల సమస్యలు, ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ఇంకా పబ్లిక్ టాయిలెట్లు, ఇతర సమస్యలెన్నో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని ఊర్మిళ అన్నారు.

     నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ

    నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ

    నాకు రాజకీయాల్లో అనుభవం లేదని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఊర్మిళ బలంగా తిప్పికొడుతున్నారు. నన్ను ఎదుర్కోలేక నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపుపై వారికి నమ్మకం లేనందునే నాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు అని ఊర్మిళ తన ప్రసంగాలతో ఆసక్తిని రేపుతున్నారు.

    సినీ కెరీర్‌కు దూరంగా

    సినీ కెరీర్‌కు దూరంగా

    ప్రస్తుతం నేను సినీ రంగానికి దూరంగా ఉన్నాను. సవాల్‌తో కూడిన రాజకీయ జీవితంపై దృష్టిపెట్టాను. పాలిటిక్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘమైన కెరీర్ కోసం చూస్తున్నాను. సినిమా కెరీర్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు అని ఊర్మిళ అన్నారు.

    English summary
    Urmila Matondkar is contesting the Lok Sabha 2019 elections with Congress ticket from the Mumbai North constituency and is pitted against sitting MP from the BJP Gopal Shetty. The actress is campaigning everyday and meeting thousands of people and listening to their problems. She opened up by saying that she's contesting the elections are she cares for the people and not using her star image in any way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X